మొదటిరోజు టాక్

ఈ మధ్య కాలంలో ఏ సినిమా తీసుకున్నా మొదటిరోజు టాక్ చాలా worstగా తయారయ్యింది అని చెప్పవచ్చు. మొదటిరోజు సినిమా చూసేది అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు, దురాభిమానులు. సినిమా ఫట్ or హిట్, టాక్ చాలా పాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. టాక్ స్ప్రెడ్ చెయ్యడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.

సినిమా కొద్దిగా తేడాగా వుంటే చాలు, worst టాక్ వస్తుంది. మొన్న ఏక్ నిరంజన్, ఈ రోజు వరుడు. నేను ఏమీ తక్కువ కాదులెండి. టాక్ తెలియకుండా నేను చూసిన దేశముదురు సినిమాకి సేమ్ టాక్ స్ప్రెడ్ చేసాను. సినిమా ఒకలా వుంటుందని ఉహించుకొని వెళితే, సినిమా ఇంకోలా వుండి సినిమాకు కనెక్ట్ కాకపొతే అంతే.

నాకు ఏక్ నిరంజన్ worstగా అనిపించలేదు. వరుడు ఎలా అనిపిస్తుందో చూడాలి. వీకేండ్ టాక్ బాగుంటే వెళదాం అనుకున్నాను. టాక్ చూస్తే ఘోరంగా వుంది. మెగా హిరో అల్లు అర్జున్ కోసం ఒకసారి చూడక తప్పదేమో.

టాక్ తో సంబందం లేకుండా ఈ సినిమా కలక్షన్స్ వుండటం అల్లు అర్జున్ గొప్పతనమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.