Ending Part 1:

నా బ్లాగ్ ఎండింగ్ ఎన్ని పార్ట్స్ వుంటుందో తెలియదు. I will be closing my blog very soon.

క్లోజ్ చేసే ముందు నా పదిహేను నెలల బ్లా గింగ్ అనుభవాలు ఏమిటో పంచుకోవాలని వుంది. అందుకే ఈ పార్ట్స్.

చిరంజీవిని విమర్శిస్తే, “నువ్వు ఆ కులపోడివి” అని కామెంట్స్, చంద్రబాబుని విమర్శిస్తే, నువ్వు పెద్ద చంద్రబాబు ద్వేషివి అని కామెంట్స్ .. వచ్చేవి.

“తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పుని ఎందుకు సమర్దిస్తున్నాం ?” అనే కోణంలో కాకుండా, కుల కోణంలో ఆలోచించడం ఏమిటో ? మన కుల/మత/ప్రాంతపోడు తప్పు చేస్తే, అది తప్పు కాకుండా అయిపోతుందా ?

నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. ఆ తర్వాత ఫ్రెండ్స్. ఆ తర్వాతే ఎవరైనా, ఏదైనా. నాకు గౌరవం ఇచ్చే వాడు లోకం దృష్టిలో ఎంత దుర్మార్గుడు అయినా కాళ్ళు మొక్కడానికి కూడా నాకు అభ్యతరం లేదు. నన్ను అగౌరవ పరిచే వ్యక్తులతో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు సహనం ఎక్కువ. కోపం కూడా ఎక్కువే. పరిష్కారం లేని సమస్యలకు మౌనమే నా సమాధానం.

నాకు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవిని తలుచుకుంటే నాలో ఉత్సాహం వస్తుంది. అటువంటి చిరంజీవిపై ఎవరైనా విమర్శలు చేస్తే తట్టుకోలేను. ఆ విమర్శలు ఏదో నేను చేసేస్తే అనే ఆలోచనతోనే కొన్ని విమర్శలు చేయడం జరిగింది.

‘పులి’ ఇంటర్నెట్ హంగామా అంతా pawanfans.com & jaichiranjeeva.com లలో చేయించాలని ప్లాన్. My role is just overlook the hungama. పులి సినిమా పాత రోజులు(జానీ హంగామా) గుర్తు వచ్చేలా చేస్తుందని ఆశీస్తున్నాను.

మా ఫ్రెండ్ కథలో పూర్తిగా ఇనవాల్వ్ అయ్యి ఉచిత సలహాలు ఇద్దాం అనుకున్నాను. వాడు వేరే ప్రాజెక్ట్ కమిట్ అవ్వడంతో దీనికి టెంపరరీ ఫుల్ స్టాఫ్ పెట్టవలసి వచ్చింది. నేను కంటీన్యూ చేద్దాం అనుకుంటే నా మార్గం కంప్లీట్ డిఫరెంట్ గా వుంది. అసలు పోటానికి ఆస్కారం వుందనిపించి, నా పైత్యం నా కథ పైనే చూపించుకుంటే బెటర్ అని నేను కూడా ఆపేసాను.

wanted సినిమా స్పూర్తితో ఒక కథ చెయ్యాలని చాలా రోజుల క్రితం ఒక ఆలోచన వచ్చింది. కాని ముందుకు సాగలేదు. దాని మీద కూర్చోవాలని నిర్ణయించుకున్నాను.

bye .. bye .. ఇక నుంచి నా అభిప్రాయాలు నా లాప్ టాప్ కే పరిమితం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.