Ending Part 2:

నేను బ్లాగు ఆపేయాలి అనుకోవడానికి కారణం నేను చెప్పేవి ఒకటి, చేసేవి ఒకటిగా  కనిపిస్తున్నాయి. నా ఆలోచన దోరణి మారనంత వరకు,  నాకు విమర్శలు చేసే అర్హత లేదు అనిపించింది. నా అభిప్రాయలతోటి పబ్లిక్ కు పనేంటి అనే ఆలోచన కూడా ఒక కారణం.
 
నా ఆలోచనలతో మ్యాచ్ అయ్యి, నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడం వలన సామాన్య జీవితం గడప వలసి వస్తుంది అని ఒక ఫ్రెండ్ అంటూ  వుండే వాడని ఎప్పుడో వ్రాసాను. నన్ను ఒకరు ప్రోత్సహించాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు.  అనుభవం నేర్పిన నా మాటలతో నా నెక్స్ట్ జెనరేషన్ వాళ్ళను  ఎంకరేజ్ చెయ్యడానికి, ఉత్సాహం కలిగించడానికి ప్రయత్నం చేస్తూ వుంటాను. కాని వారి ఆలోచనలు వాళ్ళవే, వారి అనుభవంతో తెలుసు కోవలసిందే తప్ప మనిషి ఎవరి మాట వినడు అని అర్ధం అవుతుంది. “నేను వింటానా ?”.
 
మౌనంను మించిన సుఖం మరొకటి లేదు.
 
మాటలు కాదు, చేతలు ముఖ్యం.
 
మనకు మనమే ప్రోత్సాహం కలిగించు కోవాలి. ప్రోత్సాహం కోసం ఒకరిపై ఆదారపడితే నిరుత్సాహమే మిగులుతాది. 
 
లక్ష్యం ఏదైనా, కచ్చితమైన లక్ష్యం ఏర్పరుచు కోవాలి. దాని కోసమే జీవించాలి.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.