Ending Part 3:

గమ్యం: మరణం
జీవితలక్ష్యం: నన్ను నేను తెలుసు కోవడం
ప్రస్తుతలక్ష్యం: becoming expert in drupal, ఫ్రెండ్ కు ఉచిత సలహాలు
మార్గం: దేవుడు నాకిచ్చిన తెలివితేటలను అమ్ముకుంటూ నా లక్ష్యాలను, గమ్యంను చేరుకోవడం.

చూడటానికి, వినడానికి బద్దకంలా అనిపించవచ్చు. అదృష్టమో, దురదృష్టమో తెలియదు. నేను అవకాశాల కోసం పరిగెత్తలేను.

నా సొంతడబ్బా నా లాప్ టాప్ కే పరిమితం. అందులో ఎటువంటి మార్పు లేదు. దానితో పాటు విమర్శలకు పూర్తిగా దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.

సినిమాలపై నా అభిప్రాయాలను మాత్రం తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎలా, ఎక్కడ తెలియజేయాలి అనేది ఆలోచిస్తున్నాను.

చిరంజీవి పేరు తలుచుకుంటేనే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. నా అభిమానం చాటుకోవడానికి ఆయనకు & ఆయన ఫ్యామిలీకి సంబందించిన విశేషాలు అన్నీ ఒకచోట jaichiranjeeva.com లో చేర్చాలి అని ఒక కల. బ్లాగు కోసం కేటాయించే నా ఖాళీ సమయం అంతా ఆ సైటు కేటాయిస్తాను. ఈ సైటు నిర్వహణలో ఎటువంటి స్వలాభం లేదు. కేవలం అభిమానం చాటుకోవడానికే.

My Progress on my current two goals:
1) drupal స్లోగా నేర్చుకుంటున్నాను. పులి సినిమా టైంకు jaichiranjeeva.com సైటు పూర్తీ షేప్ తీసుకొని రాలేను కాని, సైటు రన్నింగ్ లో మాత్రం పెట్టాలని అనుకుంటున్నాను.
2)మా మొదటి సబ్జక్ట్ జూలై 1st కు ఫినిష్ అనుకున్నాం. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. జూలై 1st కు మొదలు పెడితే గొప్ప . kind of upset, but nothing in my hands.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.