ముల్లును ముల్లుతోనే తీయ్యాలా

నేను విమర్శలు ద్వేషంతో చేయను. వెటకారం అనేది నా డిక్షనరీలో లేదు. నా విమర్శలు సున్నితంగా వుండేలా చూసుకుంటూ వుంటాను. విమర్శ ద్వేషంతో కూడినది అయ్యి వుండకూడదు. ఇప్పుడు ఎక్కువ విమర్శలు ద్వేషంతో కూడినవే కావడం వలన, విమర్శ అంటే గౌరవం లేకుండా పోయింది.

నాకు వాదనలంటే పరమ విరక్తి. లూజర్స్, విషయం వదిలేసి వ్యక్తిగతంగా దాడులు మొదలు పెడతారు. అందుకనే వాదనలకు దూరంగా వుంటాను. ఎక్కడైనా నేను కామెంట్స్ పెడితే, ఉచిత సలహాలతో కూడిన నా అభిప్రాయాలు తెలియజేస్తూ ఎదుటి వారి అభిప్రాయలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వుంటా.

“సినిమా అభిమానులంటే సినిమాను వెటకారం చేయడం కాదు. ఒకరి ప్రోత్సాహం కోరుకున్నప్పుడు, ఒకరిని నిరుత్సాహ పరిచే పోస్ట్ వేయవద్దు” అని నవతరంగం వారికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. నిజం చేదుగా వుంటుంది. నేనేదో వారిపై ద్వేషంతో చెపుతున్నట్లు వారికి కోపం వచ్చింది. మనకెందుకులే అని దూరంగా వున్నాను. వారంతట వారే కళ్ళు తెరుచుకొని వెటకారపు సమీక్షలకు ఫుల్ స్టాఫ్ పెట్టారు. అభినందించాను.

మంచి సినిమాలని మేము ప్రోత్సహిస్తాం అంటూ ఏదో పోటి నిర్వహిస్తున్నారు. మంచి సినిమా అంటే ఏమిటో వారి అభిప్రాయం తెలుసు కుందామని మంచి ఉద్దేశంతో అడిగితే, దొంగ ఐడిలతో అవమానించే విధంగా వెటకారం మొదలు పెట్టారు. వాళ్ళ బాషలోనే నేను తిరిగి తిడితే కాని, వాటిని డిలిట్ చెయ్యలేదు. Big shame for them.

ఒక సైటు నిర్వాహకులే దొంగ ఐడిలతో విజిటర్స్ ను హేళన చేస్తుంటే, లోకం ఎలా తయారవుతుందో తెలుస్తుంది.

విజిటర్స్ కామెంట్స్ కు వారి స్పందనను చూస్తుంటే మంచి సినిమాలని మేము ప్రోత్సహిస్తాం అనే ముసుగులో వారి సైటుకు పబ్లిసిటీ తప్ప, వారి నిర్వహించే పోటిలో నిజాయితీ లేదు అని అనిపిస్తుంది. this is not my business. నా కామెంట్స్ ను అపార్దం చేసుకున్నారు కాబట్టి, ఇది చెప్పవలసి వచ్చింది.

1) మనం విమర్శలు చేస్తున్నాం అంటే, మన మీద విమర్శలను ఈజీగా తీసుకోగలగాలి.
2) ఒకరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నపుడు …..(బూతు ఎడిటడ్)ల్లా దొంగ ఐడిలతో కాకుండా, మగాడిలా ఒక ఐడింటీతో చెయ్యాలి.

నాలో దాగివున్న రెండో వ్యక్తిని బయట ప్రపంచంకు దూరంగా వుంచాలనుకుంటాను. అది సాధించాలంటే మౌనమే మార్గం.ఎప్పటికైనా సాధిస్తా.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.