ఎవరో వచ్చి మనను ఉద్దరించరు

నేను రోజూ ఏదేదో వ్రాసే ముందు నన్ను నేను జయించాలి. అంటే నా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కోపం నా దరిదాపుల్లోకి రాకూడదు. నన్ను అవమానించినోళ్ళను క్షమించగల్గాలి. ఆ మార్గంలో నన్ను నేను ఉత్సాహ పరుచు కోవడానికి కొన్ని సేకరణలు:

క్రమశిక్షణ
సమయపాలన
కార్యదీక్ష

ఎవరో వచ్చి మనను ఉద్దరించరు. మనను మనమే ఉద్దరించుకోవాలి. నిత్య జీవితంలోని ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో ప్రతి మాటలో అంటే – మనో వాక్కాయ కర్మల్లో నిమ్నత్వాన్ని వదిలి ఔన్నత్యం దిశగా మార్పు చేసుకోవాలి. నిజాయితీగా ప్రయత్నించాలి. నెమ్మది నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా ఉదృతమై అదో త్రీవమైన తపసులా మార్చుకోవాలి. తానే తపసుగా మారిపోవాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటే ఏదైనా సాధించవచ్చు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.