Avatar

1994 లో వచ్చిన ఒక ఐడియాకు ప్రతిరూపం సినిమా అంట. 15 సవంత్సరాలు పట్టింది. నాకు నిన్న చూసే భాగ్యం కలిగింది. చాలామంది ధియేటర్ లో చూడమని చెప్పారు కాని , ఇంగ్లీష్ డైలాగ్స్ ప్రోబల్మం వలన రిస్క్ తీసుకోలేదు. నేను చూసేది సినిమా కాదు, దర్శకుడి శైలి కాబట్టి బుల్లి టి.వి లో కూడా 3D లో చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది.

సినిమా ఎలా వుంది ? ఎవరికీ నచ్చుతుంది ? నాకు నచ్చిందా లేదా ? అని ఇప్పుడు వ్రాస్తే పెద్ద కామెడీ అవుతాది. కాబట్టి అవన్నీ పక్కనబెట్టి నా ఫీలింగ్స్ రెండు ముక్కల్లో:

నేను అన్నీ వదిలేసి ఇటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించడంలో కీలక పాత్రధారిని అవ్వాలనిపించింది. ఎవరో వచ్చి మనను ఉద్దరించరు అని నేను నిన్న గ్రహించిన పోస్ట్ ను ఫాలో అవ్వాలని వుంది. కానీ ఈ ఆవేశం క్షణికం.

సాధించగలమా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్. సాధించడమే ధ్యేయంగా ప్రయత్నించడమే మన కర్తవ్యం. పరిస్థితులు సహకరించడం లేదనే సాకుతో కాలం వెల్లబుచ్చితే బ్లాగింగ్ లో ఒకరిని పొగడటం, ఇంకొకరిని విమర్శించడంతోనే కాలం గడిచిపోతుంది.

Matrix తర్వాత నన్ను కదిలించిన సినిమా Avatar.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా. Bookmark the permalink.