ప్రస్థానం Exclusive Review

చూసినా వాళ్ళందరూ బాగుందనే చెప్పారు. కొందరు చాలా మంచి సినిమా, తప్పక చూడండి అని కూడా చెప్పారు.. కాని చాలా వెబ్ రేటింగ్స్ 3/5.

సినిమాను వెటకారం చేసినపుడు నాకు ఎంత కాలి పోతాదో, ఈ వెబ్ రేటింగ్స్ చూస్తే అంతే కాలిపోతాది.

లీడర్ లాంటి సినిమాను కూడా కమర్షియల్ కోణంలో విమర్శిస్తే నాకు చాలా బాద వేసింది అని శేఖర్ కమ్ముల ఒక ఇంటార్వ్యులో అన్నాడు. సినిమా పిచ్చోళ్ళం అని చెప్పుకుంటూ సినిమా నిర్మాణంలో లోటుపాట్లు తెలిసినోళ్ళు కూడా సినిమాను విమర్శిస్తే నాకూ అదే భావన కలుగుతుంది. నిదానంగా నన్ను నేను సర్ది చెప్పుకున్నాను అని శేఖర్ కమ్ముల అన్నాడు.అదే విధంగా ఒక రివ్యూ అనేది అభిప్రాయం. మనకు నచ్చినా, నచ్చక పోయినా అభిప్రాయాన్ని గౌరవించాలి. there ends. వాదించడం వలన ఉపయోగం ఏమీ లేదు.

నేను వాదించను. వేరే చర్చలలో నా అభిప్రాయాలను తెలియజేస్తూ, ఎదుటివారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వుంటా. చిరంజీవిని ద్వేషించే వాళ్ళు, చిరంజీవి అభిమానులను కూడా ద్వేషిస్తారు. ఒక చిరంజీవి అభిమానిగా వేరే చోట అభిప్రాయాలను చెప్పడం సరి కాదు అని తెలుసుకున్నాను. నా అభిప్రాయాలను కూడా నా బ్లాగుకే పరిమితం చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

ఈ సినిమాపై సిద్దార్ద అభిప్రాయం చదివాను. చాలా ఫన్నీగా అనిపించింది. ” In our industry they tag a movie using stupid words like good, bad, commercial and art but I want to use one apt word like ‘important’ for this movie.”

ఈ సినిమా ఈ రోజు చూడబోతున్నాను. నాకు మంచి సినిమా అనిపిస్తుందో ఇంపార్టెంట్ సినిమా అనిపిస్తుందో చూడాలి.

నా దృష్టిలో సినిమా అంతిమ లక్ష్యం ప్రేక్షకాదరణే.. అది పొందకపోతే ఏదో మిస్ అయినట్లే .. ప్రతి సినిమా అవుట్ పుట్ నుంచి నేర్చుకోవలసింది ఎంతో వుంటుంది ..

సినిమాలు చూసి చెడిపోతారనడంలో నిజం వుందేమో కాని, బాగుపడతారు అనే దాంట్లో నిజం లేదు .. అలా అని మంచి ప్రయత్నాలు ఆపకూడదు .. సినిమా అంతిమ లక్ష్యం ప్రేక్షకాదరణే అయినపుడు, ఒక మెసేజ్ వున్నా సినిమా మాత్రమే మంచి సినిమా కాదు .. ప్రేక్షకాదరణ పొందిన ప్రతి సినిమా మంచి సినిమానే.

stay tuned ..

సినిమా ఎలా వుంది ?
మంచి సినిమా అని కానీ , ఇంపార్టెంట్ సినిమా అని కానీ అనిపించలేదు. ప్రేక్షకుల తీర్పుతో ఏకీభవిస్తాను. ఎవరేజ్ సినిమా. అందరూ తప్పక చూడండి అని చెప్పలేను. వెరైటీ గాళ్ళు తప్పక చూడవలసిన సినిమా మరియు వారికి నచ్చే సినిమా.

ఈ సినిమా గొప్పతనం ఏమిటి ?
ఈ కాలంలో ఏ సినిమా చూసినా, ఆ సినిమా యూనిట్, మా సినిమా తప్పక చూడండో అంటూ అడుక్కోవటం ఎక్కువై పోయింది. ఈ సినిమాను ఆ సినిమా యూనిట్ కాకుండా, ఈ సినిమా నచ్చిన వైరటీ గాళ్ళు అందరూ ఈ సినిమా తప్పక చూడండో అని చెప్పడం ఈ సినిమా గొప్పతనం అనిచెప్పవచ్చు.

కె.సి.ఆర్, విజయశాంతి స్పీచస్ బాగా చూసినట్టు వున్నావు. చాలా గౌరవంగా మాట్లాడుతున్నావు.?
‘వైరటీ గాళ్ళు’, ‘అడుక్కోవడం’ .. కిక్ కోసం వాడానులే .. ఫీల్ అవ్వద్దు .. ప్రతి మనిషిలోనూ వైరటీ గాడు వుంటుంది .. ఇటువంటి సినిమాలు చూసినపుడు వైరటీ గాడు బయటకు వస్తాడు. ఈ సినిమాపై నా అభిప్రాయం చెప్పేముందు, మిగతా వాళ్ళ అభిప్రాయలు చదవడం మంచింది. నిజం చెప్పేస్తే ఒంటరి వాడిని అయిపోయే ప్రమాదం వుంది. will be right back ..

దేవ కట్టా తెలుగు సినిమాకు ప్రాణం పోస్తాడా ?
ఒక అభిప్రాయం చదివి వచ్చాను. కొద్దిగా ఊపిరి వచ్చింది. ఈ సినిమాలోని లోపాలను కరెక్ట్ గా చెప్పారు. అదే అభిప్రాయంలో తెలుగు ‘సినిమా’ కొన ఊపిరిని కాపాడగల సత్తా ఉన్న దర్శకుడిగా వర్ణించడం, గాయానికి మందు రాయడం లాంటిదే తప్ప అది నిజం కాదు.. ప్రస్తుతం మనకు చాలా మంది మంచి తెలుగు దర్శకులు వున్నారు.

కథ ఏమిటి ?
దేవ కట్టా ఈ కథ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు అంట. నాకు అంత కష్టం కనిపించలేదు. ఇదే సినిమా తమిళంతో చిన్న చిన్న మార్పులతో రీమేక్(డబ్బింగ్ కాదు) చేస్తే పెద్ద విజయం సాధించవచ్చు అనిపించింది.

దర్శకుడి గొప్పతనం ఏమీ కనిపించ లేదా నీకు ?

అతని తప్పు కాదు. ‘తప్పక చూడండి’ ‘తప్పక చూడండి’ అంటే ఒక ‘గమ్యం’, ఒక ‘ఆ నలుగురు’, ఒక ‘బాణం’ లాంటి సినిమా ఏమో అని ఊహించు కున్నాను. తీరా చూస్తే ఒక కన్‌ఫ్యూజన్ మూవీ. డైలాగ్స్ చాలా బాగున్నాయి అంటాను తప్ప, సినిమా బాగుందని అని మాత్రం చెప్పలేను.. Very nice attempt.

లోపాలు ఏమిటి ?
నాకు నచ్చక పోవడానికి(relative) కారణం ఏమిటంటే కథలో జరిగిన ఒక సీను మనకు చూపించకుండా, చివర్లో రహస్యంగా చూపించడం. ఆ సీను కూడా మనకు ముందే చూపించి ఉత్కంటకు లోను చేసే వుంటే నచ్చేదేమో. I liked this review(click here)

సినిమాను ప్రేమించే నువ్వు ఈ సినిమాపై విమర్శలా ?
సినిమా నిర్మాతల గట్స్ ను మెచ్చుకుంటాను. దర్శకుడి కష్టాన్ని, ప్రయత్నాన్ని మెచ్చుకుంటాను. ఇన్ని లోపాలు పెట్టుకొని సినిమాను పొగడమంటే పొగడలేను. ఎంత గొప్ప దర్శకుడు, కథకుడు అయినా ప్రేక్షకాదరణే లక్ష్యంగా పనిచేయాలి.

సుకుమార్ or దేవ కట్టా or కరుణాకరన్ or కృష్ణ వంశీ or క్రిష్ or శేఖర్ కమ్ముల or అనుసూయ రవి బాబు … ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో ప్రేక్షకులు మెచ్చే కథలే మంచి సినిమా కథలు. ఏమి మిస్ అయ్యారు అనేది ఇటువంటి సినిమాల నుంచి నేర్చుకోవచ్చు.

bottomline:
1) ప్రస్థానం సినిమా వలన సాయికుమార్ కు ప్రత్యేకంగా అవకాశాలు రావచ్చు.
2) సినిమా కథలు వ్రాసే వాళ్లకు స్పూర్తినిచ్చే సినిమా కథ.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.