Good and Bad

అవకాశం రాకే చాలా మంది మంచి వాళ్ళుగా మిగిలి పోతున్నారు. అనే దానిని నేను నమ్ముతాను. మంచి చెడులు వేర్వేరుగా వుండవు. అవసరాన్ని బట్టి మంచి .. అవకాశాన్ని బట్టి చెడు. పైకి కనిపించే మన ప్రవర్తన మన మాటలు మంచి అయితే, బయటకు కనిపించని మన ఆదిపత్య ధోరణే చెడు.

చెడ్డ వాడిని చంపితే చాలామంది తప్పు కాదంటారు. కాని ఒక మంచివాడిని చంపినవాడు ఎప్పటికీ(ఎవరి దృష్టిలోను) మంచి వాడు కాలేడు. ఈ పాయింట్ మీద సినిమా అంటే ఎంతో లోతుగా ఆలోచించాలి. ఈ పాయింట్ తీసుకున్నందుకు దేవ కట్టా అభినందనీయుడు. నాలాంటి ప్రేక్షకులను కన్విన్స్ చేయలేకపోవడం అతని ఫేల్యూర్.

ఆర్య2 సినిమాలో హిరోను చెడ్డవాడిగా చూపిస్తూ, హిరోను మంచి వాడిగా ప్రాజెక్ట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ప్రస్థానం సినిమాలో మెయిన్ క్యారేక్టర్ ను మంచివాడిగా చూపిస్తూ, ఆ క్యారేక్టర్ ను చెడ్డవాడిగా ప్రాజెక్ట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. దానిని కనిపెట్టెంత అనుభవం లేదు కాని, ప్రస్థానం కథలో ఏదో మిస్ అయ్యింది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

చెడ్డవాడిని చాలా తక్కువసేపు మంచి వాడిగా ప్రోజెక్ట్ చేయడం వలన రాంగోపాలవర్మ ‘సర్కార్ రాజ్’ మూవీ ఈ విషయంలో సక్సస్ సాధించింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.