ప్రస్థానం నచ్చింది

ప్రస్థానం మా ఫ్రెండ్ ను చూడమని చెప్పాను. శనివారం టికెట్లు దొరకలేదు. ఆదివారం షూటింగ్ తో బిజీ. ఈ రోజు షూటింగ్ కాన్సిల్ అయితే చూసాడు. పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వాడు చూసిన వర్షన్ లో పాటలు లేవు. మొత్తం సీరియస్ మూవీ. వాడితో మాట్లాడుతుంటే నాకు నచ్చక పోవడానికి నా అంచనాలే కారణమా ? అని అనిపించింది.

మేమిద్దరం agree అయిన పాయింట్ ఏమిటంటే subject is very complicated. నేను స్పష్టంగా చెప్పలేదు అని వాదిస్తే, వాడు చాలా స్పష్టంగా చెప్పాడు అని వాదించాడు.

1) ఆదిపత్యం కోసం యజమానినే చంపేంత క్రూరత్వం నాకు నచ్చలేదు.
2) తోడబుట్టిన వాళ్ళనే చంపడం, చంపాలనుకోవడం అసలు నచ్చలేదు.
3) అంత క్రూరత్వంలో కూడా ‘మంచితనం’ వుంటుందనే పాయింట్ అసలు నచ్చలేదు.

అలా ప్రవర్తించడానికి కారణాలు మా ఫ్రెండ్ చెపుతుంటే, వాడు డైరక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ కు ఫుల్ గా కనెక్ట్ అయిపోయాడు అనిపించింది.

సినిమా నాకు నచ్చకపోయినా, మా ఫ్రెండ్ తో మాట్లాడాక ‘దేవ కట్టా’ ప్రయత్నంకు, కష్టంకు ఫలితం లభించినట్లే అనిపించింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.