వేదం పబ్లిసిటీ

వరుడు పబ్లిసిటీ చాలా బాగుంది అనుకున్నాను. అలానే క్యురయాసిటీ క్రియేట్ చేసింది. అంచనాలను విపరీతంగా పెంచింది. ఏ రేంజ్ లో పెంచింది అంటే ఎప్పుడో ఒకసారి సినిమాలు చూసేవాళ్ళు కూడా పబ్లిసిటీ చూసి, ఈ సినిమా ఎలాగైనా చూడాలని నిర్ణయించు కోవడం నేను గమనించాను.

తీరా సినిమా చూస్తే పబ్లిసిటీకి భిన్నంగా ఒక యాక్షన్ సినిమా చూపించారు. ఒక విధంగా మోసం అని కూడా అనవచ్చు. ఒక యాక్షన్ సినిమాగా పబ్లిసిటీ చేసుంటే బెటర్ టాక్ వచ్చేది అని నా ఫీలింగ్.

మగధీర సినిమా తీసుకుంటే, షూటింగ్ మొదలు పెట్టిన రోజే సినిమా కథ ప్రేక్షకులకు చెప్పేసారు. సినిమా స్టిల్స్, ఆడియో ఫంక్షన్ లో స్పీచస్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసాయి. దీని ఫలితం సినిమా ఓపినింగ్స్ లో కనిపించింది. సినిమా బాగుందనే టాక్, లాంగ్ రన్ కు కూడా ఉపయోగపడింది.

వరుడు పబ్లిసిటీ ప్రేక్షకులను తప్పు ద్రోవ పట్టిస్తే, మగధీర పబ్లిసిటీ కరెక్ట్ గా పని చేసింది. మగధీర పబ్లిసిటీలో నిజాయితీ వుంది, వరుడు పబ్లిసిటీలో మోసం వుంది.

వేదం పబ్లిసిటీకి కూడా వేదం టీమ్ బాగానే కష్ట పడుతున్నారు. మగధీర తరహాలో, కథ ఇది అని చెప్పేసి మంచి పని చేస్తున్నారు అనిపిస్తుంది.

అంచనాలను తప్పు ద్రోవ పట్టించక పోవడం సినిమా క్రియేటర్ బాధ్యత. వరుడు పబ్లిసిటీ ఒక పెద్ద లెసన్ అని నా అభిప్రాయం.

నిన్ననే గమ్యం సినిమా మళ్లీ చూసాను. దర్శకుడు క్రిష్, చాలా స్పష్టతతో ఎక్కడా కూడా తడబడకుండా తీసాడు సినిమా.

ఒక్క సినిమాతో టాలీవుడ్ టాప్ డైరక్టర్స్ లో చేరిపోయిన క్రిష్ మరోసారి ఇరగదీస్తాడనే అనుకుంటున్నాను. ఈయనలో నాకు నచ్చిన గుణం మాస్ ప్రేక్షకులంటే చిన్న చూపు లేకపోవడం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.