వాదన

మా ఫ్రెండ్ కు ప్రస్థానం చాలా బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. నా మాట గెలిపించుకొవడానికి ఎన్ని తంటాలు పడుతున్నాను అంటే అన్ని పడుతున్నాను. ఎన్నో నీతులు చెప్పే నేను, వాడిని అడ్డమైన ప్రశ్నలతో వేదిస్తున్నాను. నాకు నచ్చక పోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే, 1. సినిమాపై అంచనాలు, 2. కథలో ఒక సీను జరగనట్టుగా దాచేసి, దానిని చివర్లో చూపించి అదే గొప్ప స్క్రీన్ ప్లే అనడం, 3. మనిషిలోని విలనత్వం మరీ క్రూరత్వంగా ప్రవర్తించడం.

ఆర్య2 ను ఎవరైనా విమర్శించినపుడు బ్లడ్ బాయిల్ అయిపోయేది. ఎంటరటైన్ మెంట్ కోసం కొత్తదనంతో ప్రయత్నం చేసిన సినిమాపై విమర్శలా అంటూ తెగ తిట్టుకునేవాడిని. సినిమాను సినిమాలా చూడకుండా వెధవ లాజిక్కులు ఏమిటని వాదించేవాడిని.

బాణం సినిమాలో చాలా లోపాలు కనిపించినా, బాణం సినిమాను ‘ఆ నలుగురు’, ‘గమ్యం’ సినిమా తరహాలోనే ట్రీట్ చేస్తాను. ప్రస్థానం సినిమా విషయంలో ఎందుకలా ఆలోచించలేకపోతున్నాను ? .. బహుశా ‘ఆ నలుగురు’, ‘గమ్యం’ సినిమాలను గ్రేట్ మూవీస్ కేటగిరి లో వేసి, బాణం ప్రస్థానం సినిమాలను ‘నాట్ గ్రేట్ బట్ మంచి ప్రయత్నం’ కేటగిరిలో వేయవచ్చు.

సాయిబాబా నిత్య పారాయణం(ఇంచుమించు) చేస్తున్నాను. “ఎదుటివారి మాటలను, ఆలోచనలను తీసిపాడేయకు” అనే సూత్రం ఎప్పుడు ఎక్కుతుందో ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.