పూరీ జగన్నాథ్ ‘గొలీమార్’

మగధీర హిట్ తో నెం 1 స్థానాన్ని రాజమౌలి ఆక్రమించేసాడు. పోకిరి ఇచ్చిన పూరీ జగన్నాథ్ స్థానం ఏమిటని ఎవరైనా అడిగితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి స్థానం వారిది అని చెప్పవచ్చు. ఈ నెం 1 లు ఎవరు కేర్ చేస్తారు ? మనకు కావలసింది మంచి సినిమా అంటారా ? .. అది కరెక్టే.

పోకిరి తర్వాత ఏదో ఫంక్షన్ లో రాజమౌలి మాట్లాడుతూ నేను చాలా హిట్స్ ఇచ్చాను, కాని బిగ్గిస్ట్ హిట్ మాత్రం పూరీ జగన్నాథ్ గారిదే. ఆయనే నెం 1 అని ఎనౌన్స్ చేసాడు. పూరీ జగన్నాథ్ దానికి ప్రతిఫలంగా మగధీర పోకిరిని దాటేసింది అని లైవ్ పోగ్రాంలో ఒక మహేష్ బాబు అభిమానిని ఖండించాడు.

నేను చెప్పేది ఏమిటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కు ప్రత్యేక స్థానం వుంది. ఆయనలో నాకు నచ్చిన ప్రత్యేకత ఏమిటంటే, చాలా తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో సినిమాను లాగించేస్తాడు. రెమ్యునరేషన్స్ వలన బడ్జెట్ పెరగాలి తప్ప, నిజానికి తక్కువ ఖర్చుతో ప్రేక్షకులకు ఎక్కువ అనుభూతిని ఇస్తాడు. తక్కువ పెట్టుబడితో పోకిరి సినిమా ఎంతమంది కోటిశ్వరులను చేసిందో అందరికీ తెలిసిందే. ఆ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేరు.

మాస్ లో మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్న గోపీచంద్ హిరోగా వస్తున్న గొలీమార్ ఆడియో రిలీజ్ అయ్యింది. నిన్నటి నుంచి ఆడియో లూప్ లో పెట్టి వింటున్నాను. ‘గొలీమార్’ ఆడియో రివ్యూ రాద్దాం, దానికి ముందు మాటగా రెండు ముక్కలు రాద్దాం అనుకుంటే, పూరీ గురుంచి చెప్పటానికి రెండు ముక్కలు సరిపోలేదు. గొలీమార్‘ ఆడియో రివ్యూ అనే హెడ్డింగ్ ను పూరీ జగన్నాథ్ ‘గొలీమార్గా మార్చి సెపరేట్ చేసాను. ఆడియో రివ్యూ follows ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.