వేదం సినిమాపై నాకున్న అనుమానాలు

వేదం సినిమాపై నాకు భారీ అంచనాలు వున్నాయి. అదే విధంగా అనుమానాలు కూడా వున్నాయి.  

అంచనాలు:  

  • బిగ్ కమర్షియల్ హిట్ అవుతుందనుకుంటున్నాను.
  • మాస్ ప్రేక్షకుడికి కన్‌ఫ్యూజన్ లేని కొత్త స్క్రీన్ ప్లే.
  • ఈ సినిమా ద్వారా ఒళ్ళు గుగుర్పాటు అంటే కష్టం ఏమో కాని, ప్రతి ఒక్కరి కళ్ళ వెంట ధారాళంగా నీళ్ళు ఎక్సపెట్ చేస్తున్నాను..
  • అల్లు అర్జున్, మంచు మనోజ్ అంటే అయిష్టత వున్న వాళ్ళు , వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని ఆశీస్తున్నాను.
  • హిరోయిన్ అనుష్కకు అరుంధతి సినిమాకు మించిన పేరు.
  • అత్యద్భుతమైన కీరవాణి మ్యూజిక్.
  • మరొకరికి ‘తప్పక చూడండి’ అని చెప్పడం కాదు, మరొకరిని సినిమాకు తీసుకొని వెళ్లి మరీ చూపించే సినిమా అవుతుందని ఎక్సపెట్ చేస్తున్నాను.

అనుమానాలు:
నాకు గుర్తున్నంత వరకు వరస్ట్ పబ్లిసిటీ అంటే ‘శ్రీ ఆంజనేయం’. ఎంత భక్తి పరమైన టైటిల్ అది. చార్మీ బొమ్మలతో గబ్బు గబ్బు పుట్టించారు. తర్వాత వరుడు. ఈ సినిమా విషయంలో వరస్ట్ పబ్లిసీటీ కాదు కాని, రాంగ్ పబ్లిసీటీ. సినిమాకు ఓపినింగ్స్ అవసరం. అది పబ్లిసిటీ ద్వారానే సాధ్యం. కాదనలేము. వేదం సినిమాకు ఇటువంటి పబ్లిసిటీ అవసరం లేదు. చేయకూడదు. అనుష్క పోస్టర్స్ చూస్తే, నాకు ఈ సినిమా కూడా ‘శ్రీ ఆంజనేయం’, ‘వరుడు’ సినిమాల కోవలోకి చెందుతుందా అనే డౌట్ వచ్చింది. ఒకటి రెండుకు పరిమితం చేయకుండా టూ మచ్ ఫోటోస్ రిలీజ్ చేసారు. అనుష్క క్యారెక్టర్ ద్వారా హృదయానికి హత్తుకునే(నా ఉహ) ఎమోషన్స్ రాబట్టడానికి ప్రయత్నం చేసి, పోస్టర్స్ ద్వారా మరో మెసేజ్ పంపడం నచ్చలేదు.

ఇంకోటి ఏమిటంటే నా అంచనాలను రీచ్ అవుతుందా అనే అనుమానం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.