పరనింద

ఈరోజు ఈనాడు అంతర్యామిలో డాక్టర్ వంగీపురం శ్రీనాధాచారి గారు వ్రాసిన మాటలు:

ప్రతికూల పరిస్థితులనేవి మనిషి చుట్టూ వచ్చి చేరవు. మనిషే వాటిని సృష్టించుకోవాలి. క్రియాశూన్యతతో వాటిని అధిగమించలేక ఎవరెవరినో నిందిస్తూ కాలాన్ని గడిపేస్తూ వుంటాం.

ఒకరిని నిందించడం, ఒకరిని ద్వేషిచండం .. ఇదేనా మన జీవితం?

నేను ఈ మధ్య కాలంలో నేను గమనించిన విషయం ఏమిటంటే: తప్పులు చేస్తూ , తప్పు చేయడానికి కారణం మరో తప్పును చూపుతూ మనలను మనం సమర్దించుకోవడం.

ఉదాహరణకు బాలకృష్ణ/చిరంజీవి మీదో జోకులు వేసుకుంటూ ఎంజాయ్(పైశాచిక ఆనందం) చేయడం వేరు. దానికి కారణం వాళ్ళెవరో ఇలా చేసారు కాబట్టి ఇది సృష్టించాం అని చెప్పడం ఏమిటో ?
మరో ఉదాహరణ. తెలుగు సినిమాలు కాపీరైటు లేకుండా కాపి కొట్టారు కాబట్టి, నేను పైరసీ ప్రింటులో చూడటం కాదు అని సమర్ధించుకోవడం.

This is where I am confused. తప్పు చేయడం తప్పు. తప్పు చేయడానికి కారణం మరో తప్పును చూపించి మనలని మనం సమర్దించుకోవడం ఎంత వరకు సబబు ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, Xclusive. Bookmark the permalink.