గొలీమార్ పై నా అంచనాలు

బుజ్జిగాడు నాకు బాగా నచ్చడం వలన ‘ఏక్ నిరంజన్’ పై చాలా అంచనాలు పెట్టుకున్నాను. ‘ఏక్ నిరంజన్’ మరీ అంత ఘోరంగా లేకపోయినా, అంచనాలు వలన, పూరీ రోటీన్ టేకింగ్ వలన సినిమా అసలు పండలేదు.

పూరీ సినిమాలన్నీ ప్లాఫ్/ఎవరేజ్ టాక్ తోనే మొదలవుతాయి. ఆయన సినిమాలతో పాటు రీలిజ్ అయ్యే సినిమాలన్నీ ఘోరంగా ప్లాఫ్ అయితే, ఈయన సినిమా పికప్ అవుతాది.

తక్కువ ఖర్చు, తక్కువ కాలంలో సినిమా ఫినిష్ చేయడం ఈయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

గొలీమార్ పాటలు చాలా బాగున్నాయి కాని రోటీన్ అనిపించాయి. ట్రైలర్స్ కూడా రోటీన్ అనిపించాయి. నా అంచనా ప్రకారం మాస్ హిట్ అవ్వచ్చు. కొద్దిగా కొత్తదనం చూపిస్తే అందరికీ నచ్చే అవకాశం వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.