సింహా రివ్యూ

ఎవరి సినిమాలా వుంది ?
రాజమౌళి సినిమాలా అనిపించింది. బాలయ్యతో రాజమౌళి అంటే ఎక్సపెటేషన్స్ ఒత్తిడితో ఏమి చేసినా విమర్శించే వాళ్ళు. బోయపాటి బాలయ్యను, బాలయ్య ఇమేజ్ ఇంత ఫరఫెక్ట్ గా వాడుకుంటూ సినిమా వుంటుందని నేనైతే ఎక్సపెట్ చేయలేదు. సరప్రైజ్ మూవీ ఫ్రం బోయపాటి.

బాలకృష్ణ ఎలా చేసాడు ?
ఈ సినిమా అంతా బాలకృష్ణ ఇమేజ్ మీద తీసిన సినిమా. ఎక్కడా కూడా ఎబ్బెట్టు అనేదానికి ఛాన్స్ లేకుండా బోయపాటి execute చేసాడు.

టార్గెట్ ఆడియెన్స్ ఎవరు ?
ఈ సినిమాకు మాస్ ప్రేక్షకులే టార్గెట్ ఆడియెన్స్ అనిపించింది. నాకైతే ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకున్నట్టుగా ఎక్కడా అనిపించలేదు.

వయలెన్స్ ఎక్కువ అన్నారు ?
అరుంధతి సినిమా విలనిజం చూపించడానికి క్రూరమైన సీన్స్ వున్నాయి. మేధావులందరూ అవసరం అన్నారు. నాకు ఈ సినిమాలో కూడా అవసరమే అనిపించింది. వయలెన్స్ ను క్షమించగల్గితే సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

బూతులు ?
బూతులు అవసరం నాకైతే కనిపించలేదు.

వంశం డైలాగ్స్ ?
ఇవి కూడా అవసరం అనిపించలేదు.

సినిమా ప్రత్యేకత ఏమిటి ?
సినిమాలో లీనం అయితే, ఎమోషనల్ గ్రాఫ్ బాగుంది. ఎక్కడా డ్రాప్ అవ్వదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.