vedam eXclusive Review

మొత్తానికి చాలా రోజుల తర్వాత వెబ్ రివ్యూస్ చదవకుండా ఒక సినిమా చూడగల్గాను.

సినిమా చూడవచ్చా ?
ఈ ప్రశ్నకు జవాబు ప్రశ్న అడిగే వాళ్ళను బట్టి వుంటుంది. మగధీర సినిమా నచ్చని వాళ్ళు కూడా వున్నారు. సో ఈ సినిమా అందరూ తప్పక చూడండి అని చెప్పడం తప్పు. అలా అని చెప్పి సమాధానం చెప్పకపోతే రివ్యూ వ్రాయడం తప్పు. చూడాలా వద్దా అని ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాలి. చూడండి అనో చూడకండి అనో చెప్పడం కంటే, నా ఈ సినిమా ఎమోషన్ జర్నీతో పాటు నలుగురికి
ఈ సినిమాలో ఏమి నచ్చుతాయి అని నేను అనుకుంటానో కొన్ని ప్రశ్న-జవాబులు రూపంలో చెప్పడం బెటర్.

సినిమాజనాలకు నచ్చుతుందా ?
ముంబాయి తాజ్ హోటల్ లో జరిగిన విధ్వాంసకాండ మన కళ్ళముందు జరిగితే, పదిమంది కోసం మనం ప్రాణ త్యాగం చేయగలిగే మనసు మనకు వుంటే సినిమా నచ్చుతుంది అనిపించింది.

నీకు నచ్చిందా ?
నచ్చింది. సినిమా చివర మనస్పూర్తిగా ఏడ్చేసాను.

అంటే నువ్వు పదిమంది కోసం మనం ప్రాణ త్యాగం చేయగలవని అనుకోవచ్చా ?
అది పొరబాటు. నాకు బాద్యతలు లేకపోతే కచ్చితంగా చేయగలను. బాద్యతల వలయంలో చిక్కుకుపోయాను. ప్రాణం విలువైనది అయినది అయినా, ఎవరికైనా ఒకానొక సమయంలో ఒక సిట్యువేషన్ ప్రాణం కంటే విలువైనది అనిపిస్తుంది. సో సినిమా హిట్ or ఫట్ , ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోల ప్రాణ త్యాగం కరెక్ట్.

కీరవాణి ఈ సినిమాలో హీరోలు వుండరు. మనిషే హిరో అని చెప్పారు. నువ్వేమో హిరోలు ప్రాణత్యాగం అంటున్నావు ?
ఆయన ఉద్దేశం ఆ సిట్యువేషన్ లో మనిషి అనేవాడు ప్రాణత్యాగం కోరుకుంటాడు అని అర్ధం అనుకుంట.

హైలట్స్ ఏమిటి ?

  • మల్టీస్టారర్ సినిమా అని ఉదరగొట్టి ‘గెస్ట్ ఎప్పిరియన్స్ మనోజ్’ అని టైటిల్స్ లో వేయడం చాలా కామెడీగా వుంది. చాల డెప్త్ వున్న క్యారెక్టరైజేషన్. చిన్న రోల్ అయినా ఫస్ట్ నుంచి చివరి దాకా వున్న రోల్ . చాలా బాగా చేసాడు.
  • ఈ సినిమా అల్లు అర్జున్ చేయడం ఏదో పెద్ద త్యాగం అని చెప్పుకోవడం చాలా బాదపడవలసిన విషయం అనిపించింది. నా దృష్టిలో అదృష్టంగా చెప్పుకోవలసిన సినిమా ఇది.
  • అనుష్కా, మనోజ్ బాజ్పాయ్ జీవించారు. ముసలాయన బాగానే సెట్ అయ్యాడు కాని పాత్రలో జీవించ లేకపోయాడు.
  • ఈ సినిమా హీరోలు అల్లు అర్జున్ మరియు మంచు మనోజ్ అయితే తెర వెనుక హీరోలు క్రిష్ మరియు కీరవాణి.

రెండు మాటలు:
క్రిష్ మంచి దర్శకుడా అని ఎవరైనా అడిగితే, మంచి మనసున్న దర్శకుడు అని చెపుతాను. ఈ సినిమా పదిసార్లు చూసే కమర్షియల్ సినిమా కాకపోవచ్చు కాని, పది రోజులు గుర్తుండి పోయే తెలుగు సినిమా.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.