ఖాళీ సమయం

May 27th కొత్త ప్రాజెక్ట్ లో చేరిన దగ్గర నుండి ఆలోచించడానికి కూడా సమయం లేకుండా గడించింది. మొన్న లాస్ట్ వీకేండ్ ఒక్కటే ఫ్రీగా వున్నాను. ఈ వీకేండ్ కూడా ఫ్రీనే. ఇక నుంచి ఖాళీ సమయం బాగానే దొరుకుతుంది అనుకుంటున్నాను. బ్యాడ్ అనుభవం నేర్పిన పాఠాలతో ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానో లేక ఎప్పటిలానే కలలు కంటూ వేస్ట్ చేస్తానో కాలమే సమాధానం చెపుతుంది. బ్లాగు వ్రాయాలని అసలు ఆసక్తి లేకపోయినా ఎందుకో వ్రాస్తున్నాను. అందుకనే అన్ని పోస్ట్లు incompleteగా మరియు మరింత కన్‌ఫ్యూజన్ గా వుంటూన్నాయి. ఆలోచించ కుండా వ్రాస్తే అంతే కదా !

చిన్నప్పుడు మెకానికల్ వర్క్ షాప్ ఒకటి నిర్మించాలని, a2z ఆ వర్క్ షాప్ లో వుండాలని ఒక పెద్ద కోరిక వుండేది. అది సాధించ లేకపోయాను. ఇప్పుడు దానిని నిర్మించుకోవడం చాలా ఈజీ. కాని దాని అవసరం కనిపించడం లేదు. ఇప్పుడు సాఫ్ట్ వేర్ డెవలెప్ ఎన్వీరనమెంట్ ఒకటి నిర్మించాలని కోరిక బాగా నాటుకు పోయింది. సినిమా కలలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి బ్రతకడానికి కావాల్సిన నాలెడ్జ్ సంపాధించుకుంటే అనే ఈ ఆలోచన ఎంత వరకు ముందుకు సాగుతుందో చూడాలి.

START OVER AGAIN

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.