రాజకీయ సంక్షోభం

కె.సి.ఆర్ దెబ్బకు ఎక్కవ నష్టపోయింది తెలగుదేశం పార్టీ. ప్రాంతం పేరుతొ ప్రజలను రెచ్చగొట్టి మభ్యపెట్టడం కె.సి.ఆర్ తరహా రాజకీయం. ఇప్పుడు కె.సి.ఆరే నెం 1 రాజకీయ నాయకుడు.

చంద్రబాబు రాజకీయ చక్రం తిప్పడంలో సిద్ధ హస్తుడు. ఆ చక్రాన్ని పాజిటివ్ గా చూపించడంలో ఈనాడు పత్రికది ప్రధాన పాత్ర. తెలగుదేశం పార్టీ అంటే ఈనాడు పేపరు. ఈనాడు పేపరు లేకపోయి వుంటే తెలగుదేశం పార్టీ వుండేది కాదేమో అని డౌట్ వస్తుంది.

ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే, రాజశేఖరరెడ్డి ఎంతమంది ఆత్మీయులను సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ మంది శత్రువులను కూడగట్టుకున్నాడు అనిపిస్తుంది. ఈ మధ్య వార్తలు చదువుతుంటే పేదవాడిని పావలా వడ్డీ అండ్ సో ఆన్ పథకాలతో మభ్యపెడుతూ రాష్ట్రంలో అవినీతి వృక్షాన్ని బాగా పెంచేసాడు అనే ఫీలింగ్ వస్తుంది..

చిరంజీవి రాజకీయ అవినీతి కోసం ఆరాట పడుతున్నాడు. అవకాశం ఇస్తే అవినీతికి తన తరహా కొత్త మార్గం చూపిస్తాడు.

మనం చేసే పనులన్నీ మనకు మంచివి లానే అనిపిస్తాయి. అవినీతి నిర్మూలించడం ఆసాధ్యం. అవినీతి లేకపోతే ఎవరికీ ఫన్ వుండదు.ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తే, చేసేవాడి అర్హత అడుగుతారు. చేసిన వాడిపై ఆరోపణలు చేస్తారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.