కొమరం పులి రిలీజ్

ఫ్యాన్స్ , ప్రేక్షకులు సినిమాను మర్చిపోకుండా సినిమా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని అబద్దాల రిలీజ్ డేట్లు వదులుతూ వుంటారు. కొమరం పులి మొదటి అబద్దపు రిలీజ్ డేటు సంక్రాంతి 2009. అప్పటి నుండి ఎన్నో అబద్దపు రిలీజ్ డేట్లు వచ్చాయి.

అన్నీ లేట్లు కలిపి నేను ఒక గెస్ కొట్టి ఇప్పుడు రిలీజ్ అవ్వచ్చు వ్రాసాను. నా గెస్ కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యింది. నేను ఉహించిన డేటుకు ఆడియో వచ్చింది. కొమరం పులి సెన్సార్ అయిపోయింది. ఈ నెల 10 వ తారీఖు రిలీజ్ అవుతుంది అని స్ట్రాంగ్ ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత నిజమో నిర్మాతకే తెలియాలి.

for some reason, మెగా సినిమాల కోసం ఇది వరకు ఎదురు చూసినంతగా ఇప్పుడు ఎదురు చూడటం లేదు. దాని వలన నాకు ఆందోళన, అలజడి అసలు లేవు. (ఇది వరకు అయితే దాని గురించే ఆలోచించే వాడిని) . మగధీర కోసం చేసిన హడావుడి కూడా forced గా చేసిందే. నిజానికి అటువంటి హడావుడి ప్రతి సిని కు చెయ్యాలని కల కనేవాడిని. కల రివర్స్ అయ్యి, మెగా సినిమాలకు కూడా చేయలేకపోతున్నాను. పాత ఉత్సాహాం కోసం ప్రయత్నం చెయ్యాలి. 🙂

ఈ వీక్ లో సినిమాలపై నా ఆసక్తిని వెనక్కి తీసుకొని రావాలి. I will try.

రెండు రోజులు క్రితం వెంకటేష్ కు సరిపోయే ఒక ఇంగ్లీష్ సినిమా చూసాను. వెంకటేష్ కు బాగా సెట్ అయ్యే సినిమా అనిపించింది. సబ్జక్ట్ లో మంచి స్క్రీన్ ప్లే కు ఛాన్స్ వుంది. ఆ ఇంగ్లీష్ సినిమా ఆదారంగా తెలుగు కథ అల్లడం నాకు కష్టమైనా పని కాని, ఈ కథకు స్క్రీన్ ప్లే ఇలా వుంటే బాగుంటుందనే ఆలోచన(ఇది కాపీ కాదు) వచ్చింది. ఇది సొంతంగా నాదే.

తూచ్ .. START OVER AGAIN అన్నట్లు, పాత స్టోరీ ఆలోచనలను పక్కన పెట్టి ఈ కథ-స్క్రీన్ ప్లే మీద పని చెయ్యాలని వుంది. నా మైండ్ అటువైపు పెట్టడానికి టైం వుండటం లేదు. ఏదో miracle జరిగి దానికి కావలసిన ఉత్సాహాన్ని దేవుడు ఇవ్వవలసిందే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.