కొమరం పులి టాక్

మాది పక్కా పల్లెటూరు. మా వూళ్ళో వాళ్ళందరికి ఇంటర్నెట్ సదుపాయం వుంటే బాగుండును అనుకుంటూ కలలు కంటూ వుండేవాడిని. ఇంటర్నెట్ అంటే టైం వేస్ట్ చెయ్యడానికి మార్గం అని అనిపించడం మొదలైన దగ్గర నుండి అలా కలలు కనడం మానేసాను. ప్రస్తుతం ఉపయోగం మాట ఎలా వున్నా, నిరూపయోగమే ఎక్కువ అనే అభిప్రాయంలో వున్నాను.

నేను ఇంటర్నెట్ ద్వారా టైం వేస్ట్ అయ్యే ఎక్టవిటీస్ అన్నీ మానేసాను. కానీ మనసు అటువైపే లాగేస్తుంది.

దానికి కొమరం పులి టాక్ కి ఏమిటి సంబంధం ఏమిటా అని అనుకుంటున్నారా ? వెబ్ టాక్ ను నేను కేర్ చెయ్యను. కాని వెబ్ టాక్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడ చూసినా ద్వేషంతోనో , హై ఎక్సపేటేషన్స్ తోనో చూసి వ్రాసిన రివ్యూలు అభిప్రాయలే ఎక్కువ కనిపిస్తున్నాయి. పైశాచిక ఆనందం ఎక్కువైపోయింది. good or bad review, better not to follow any review అని ఎప్పుడో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి వున్నాను.

ఎప్పుడు చూస్తున్నావు?
మెసేజ్ సినిమాలు అన్నా, అసలు మెసేజ్ అంటేనే చాలా విరక్తితో వున్నాను. అందుకనే ఈ సినిమా థియేటర్ లో చూడకూడదు అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాని నాకు వచ్చిన టాక్ నన్ను టెంప్ట్ చేస్తుంది.

నాకు వచ్చిన కొమరం పులి టాక్ టాక్:
డైలాగ్స్ కేక. పవన్ కళ్యాణ్ నటించినట్టు కాకుండా, తన సొంతంగా తన మనసులోంచి వచ్చినట్టు, బయట ఎలా వుంటాడో అలానే వున్నాయి.

ఒక పవన్ కళ్యాన్ అభిమానిగా అదొక్క పాయింట్ చాలు సినిమా థియేటర్ లో చూడటానికి. నేను చేయవలసిన పనులు చాలా వుండటం వలన ఈరోజు చూడగలనో లేదో !

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.