వెటకారం

నాకు నచ్చనిది ‘వెటకారం’. నాకు తెలుసున్న వాళ్ళు నా మీద జోక్ వేస్తే చిరునవ్వే నా సమాధానం. నేను రిప్లై ఇవ్వక పోవడం వలన, నా మీద పెద్ద జోక్స్ వుండవు. నేను పెద్దగా విమర్శలు కూడా చెయ్యను. అనవసరంగా ఎవరినైనా ఎవరైనా విమర్శిస్తే ఫీల్ అవుతాను. అది చిరంజీవికి సంబందించింది అయితే మరికొంత ఎక్కువ ఫీల్ అవుతాను. ఒకరి అపజయాన్ని నేను అసలు ఎంజాయ్ చెయ్యను.

చిరంజీవి సినిమానే కాదు, ఏ సినిమాపై నెగటివ్ రివ్యూను భరించలేను. హిరో ఎవరైనా, రివ్యూస్ లో వెటకారతనాన్ని అసలు భరించలేను.

పులి సినిమా రివ్యూస్ చదివి అలానే బాద పడ్డాను. సినిమా చూసాక, వారి వెటకారతనం అర్ధం తెలిసింది. పులి సినిమా ద్వారా వారి రివ్యూ, వారి అభిప్రాయం వారి ఇష్టం. చదవడం మానేయాలి. లేదా take it easy గా తీసుకోవాలి. పులి సినిమా రివ్యూలపై నేను చేసిన కామెంట్స్ అన్నీ వెనక్కి తీసుకుంటున్నాను.

నేను చిరంజీవిని నెగటివ్ గా కామెంట్ చెయ్యడానికి వెనుకాడటం లేదు. కాని ఎవరైనా చేస్తుంటే భరించలేకపోతున్నాను. ఇదేమి జబ్బో. I SHOULD COME OUT OF IT IMMEDIATELY

విమర్శలు ఎంత ఘాటైనా, క్రూరమైనవి, బాద కలిగించేవి అయినా take it easy and no reply is the best reply. like pawan kalyan

My Exclusive Puli Review coming soon ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.