కొమరం పులి exclusive review

సినిమా చూడవచ్చా ?
ప్రస్తుతానికి నా దగ్గర సరైనా సమాధానం లేదు. will be updated later ..

కొమరం పులి సినిమా ఎవరికి నచ్చుతుంది ?
సామాన్య ప్రేక్షకులు: సినిమా గురుంచి అంతా తెలుసుకునే వస్తారు. వెల్ ప్రిపేర్ అయ్యి వస్తారు కాబట్టి, మరీ అంత కాకపోయినా డిస్సాపాయింట్ అవుతారు.

సినిమా పిచ్చోళ్ళు: ఆవేశంతో ఎంటరటైనమెంట్ కోసం వస్తారు.బిగ్ డిస్సాపాయింట్ ఫర్ దెమ్.

అభిమానులు: వీరి గురుంచి చెప్పాలంటే నాకు వర్డ్ ప్రెస్ వారి ఇచ్చిన స్పేస్ సరిపోదు. ఇప్పుడు కాంటెస్ట్ మూడు ముక్కలలో చెప్పాలంటే 1) తన అభిమాన హిరో సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు గర్వంగా రావాలని, 2) తన అభిమాన హిరోతో సినిమాతీసిన నిర్మాతకు, డిస్టిబ్యుటర్స్ కు అత్యంత లాభాలు రావాలని, 3) తమ హిరో ఇతర హీరోలకు ఆదర్శంగా వుండాలని కోరుకుంటారు. BIG LET DOWN.

మంచి మెసేజ్ వుంది, పవన్ కళ్యాణ్ బాగా చేసాడు కదా ?
సినిమా నిర్మాత ఎంత అభ్యుదయ బావాలతో సినిమా తీసినా సినిమా ప్రమోషన్స్ లో తప్పుగానే ప్రమోట్ చేస్తారు. సినిమా అనేది వ్యాపారం కాబట్టి అది సహజం. పవన్ కళ్యాణ్ దానికి అతీతంగా వుండాలి అని కోరుకుంటాను. ఈ సినిమాను హైప్ లేకుండా తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో నిర్మించి వుంటే ఒక అభిమానిగా గర్వపడే వాడిని.

హైప్ సృష్టికర్త పవన్ కళ్యాణ్ కాదు కదా ?
ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ కు పూర్తిగా వ్యతిరేకిని. తాను తప్పులు చెయ్యడు. మంచిది. కాని తప్పు తన వాళ్ళు చేసినా తప్పు తనదే అని ఫీల్ అవ్వడు. How could it be ?. వ్యాపారాత్మకంగా అలోచించేటప్పుడు ఇటువంటి మెసేజ్ సినిమాలు పవన్ కళ్యాన్ చెయ్యకూడదు అనే కోరుకుంటాను.

సినిమాలో మెసేజ్ ఏమిటి ?
“నీతులు చెప్పడం ఈజీ. వినడం కష్టం. పాటించడం ఇంపాజిబుల్ .” అనే అభిప్రాయంతో వున్నాను. సినిమాలో మెసేజ్ బిట్స్ బిట్స్ గా చూస్తే బాగుంటుంది. సినిమాగా చూస్తే తేలిపోయెలా వుంది. నాకు టాక్ చెప్పినతను చెప్పిన “డైలాగ్స్ కేక. పవన్ కళ్యాణ్ నటించినట్టు కాకుండా, తన సొంతంగా తన మనసులోంచి వచ్చినట్టు, బయట ఎలా వుంటాడో అలానే వున్నాయి.” కరెక్ట్ అనిపించినా BIG LET DOWN

పవన్ కళ్యాన్ పై నీ అభిమానంలో మార్పు ఏమైనా వచ్చిందా ?
సినిమా సినిమాకు కొత్త తప్పులు చేస్తూనే వున్నాడు. సినిమాపై పూర్తి బాద్యత తీసుకుని, పబ్లిసిటీపై తన అభిప్రాయాన్ని మార్చుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.