మెసేజ్ ఒరింటెడ్ మూవీస్

కొమరం పులి సినిమా అంటే నాకు మొదటి నుంచి ఉత్సాహం లేకపోవడానికి కారణం మెసేజ్ ఒరింటెడ్ మూవీ అని.

నా ఫ్రెండ్ మెసేజ్ ఒరింటెడ్ కథ తయారు చేస్తాను అంటాడు. నాకు ఆ అర్హత లేదు. నేను ఇనవాల్వ్ కాలేను. నువ్వే కష్టపడు అంటాను. వాడు కష్టపడి క్రియేట్ చేసుకున్న సీన్స్ “ఉ”, “బాగానే వుంది” అనే డైలాగ్స్ తప్ప మనసు పెట్టి వినడం, మనసు పెట్టి బాగుందని చెప్పలేకపోతున్నాను.

నీతులు చెప్పేవాడు పాటించవలసిన అవసరం లేదు. పాటించే వాళ్లకు ఇన్ స్పైరింగ్ గా వుంటే చాలు. అంటాడు.

నీతులు పాటించే వాడికి ఇన్ స్పైరింగ్ అవసరం లేదు. ఎదుటి వాడు చేస్తే తప్పు అనిపించేది తాము చేస్తే తప్పు కాదు అనిపిస్తాది(like నేను చిరంజీవిని విమర్శించవచ్చు, కాని ఎవరూ విమర్శించకూడదు అని నాకు అనిపించడం). దీనిని ఎవరు మార్చలేరు. మెసేజ్ ఒరింటెడ్ సబ్జక్ట్ వద్దు అనే నా వాదనను వాడు పట్టించుకోవడం లేదు.

లీడర్ సినిమా బాగుంది. అదే సినిమాను హ్యాపి డేస్ సినిమా ఎంత బడ్జెట్ లో తీసాడో అంతే బడ్జెట్ లో తీయక పోవడమే నాకు నచ్చలేదు. శేఖర్ కమ్ములకు నేను అభిమానిని కాదు కాబట్టి లైట్ తీసుకున్నాను.

మహాత్మా సినిమాతో శ్రీకాంత్ జీవితాన్నే మార్చేసిన కృష్ణ వంశీ అన్నా అంతే.

ఇప్పుడు కొమరం పులి.

ఇక్కడ మెసేజ్ ఒరింటెడ్ మూవీస్ తక్కువ టైంలో చుట్టేయమని కాదు నా ఉద్దేశం. ఒక ఆశయంతో తీసే సినిమా అన్ని డైరక్షన్స్ లో ఎంతో శ్రద్ధతో తియ్యాలి. ఎక్కడా కూడా మోసానికి, ఆత్మవంచనకు అవకాశం వుండకూడదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.