సూపర్ వైజర్

నేనొక మంచి ప్రోగ్రామర్ అని నా నామ్మకం. అంటే మంచి వర్కర్. ప్రోగ్రామింగ్ మీద మమకారంతో సూపర్ వైజర్ పోస్ట్ కాదనుకొని వెనక్కి వచ్చేసాను. I love to work than supervising. నా జాబ్ నా సూపర్ వైజర్ చెప్పింది ఫరఫెక్ట్ గా చేయడమే. నా వర్క్ తో సూపర్ వైజర్ని ఇప్రేస్ చేస్తూ productని అనుకున్న టైంలో అనుకున్న విధంగా డెలివరీ చేయడం. నేను మంచి వర్కర్ అనడానికి నిదర్శనం గత పదేళ్లుగా నా సూపర్ వైజర్ ఒక్కడే. పని చేసేది అంతా నేనే. సూపర్ వైజర్ కు నాకంటే జీతం ఎక్కువ, పేరు అంతా అతనే ఎక్కువ కొట్టేస్తూ వుంటాడు(of course he knows functionally every in and out than me ). నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే 1) I love my work and I am very happy with what I am getting 2) నేను రిపోర్ట్ చేసే సూపర్ వైజర్ నన్ను గుర్తించాడు.

ఇదంతా ఎందుకంటే, తొలిప్రేమ నుంచి గుడుంబా శంకర్ దాకా పవన్ కళ్యాణ్ తన సినిమాలను సూపర్ వైజ్ చేసేవాడు. బాలు సగం, అన్నవరం సాంగ్స్ కూడా సూపర్ వైజ్ చేసాడు. ఆ తర్వాత సినిమాలకు కథ లైను కు పరిమితం అయ్యి, సినిమా అంతా దర్శకుడికే వదిలేసాడు. దాని పర్యవశనమే ఒకదానిని మించిన సినిమాలు ఇంకోటి వస్తున్నాయి. తన సినిమా లకు సంబందించి పూర్తీ బాద్యతను తాను తీసుకోవలన్నదే అభిమానిగా నేను కోరుకునేది.

ఒక మనిషికి సూపర్ వైజర్ ఎంతో అవసరం. ఒక మనిషి డెసిషన్స్ ఎల్లప్పుడూ కరెక్ట్ కావు. ఒక విజయానికి టీమ్ అవసరం అయినపుడు, ఒక వ్యక్తే ఎల్లప్పుడూ విజయాన్ని అందించలేడు.సూపర్ వైజింగ్ వుంటే మంచి అవుట్ పుట్ ఇవ్వవచ్చని నా అభిప్రాయం.

I want to be సూపర్ వైజర్ for upcoming CHESS players:
నేను చెస్ లో లీనమైతే బీభత్స మైన ఐడియాలు వస్తాయి. ప్రాక్టీస్ గేమ్స్ లో ఇరగదీసే నేను, సీరియస్ గేమ్ అయితే బొక్క బోర్లా పడతాను. దానికి కారణం నాకు సూపర్ వైజర్ లేకపోవడమే అని నా ఫీలింగ్. So upcoming CHESS players కి సూపర్ వైజర్ గా వుండాలని నా కోరిక.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.