మున్నా exclusive review

సినిమా ఇప్పటిదాకా చూడలేదా ? సడన్ గా ఇప్పుడు చూడటానికి కారణం ఏమిటి ?
సినిమా బాగానే వుంటుందని విన్నాను. ఎందుకో మిస్ అయ్యాను. మొన్న ఆడియో ఫంక్షన్ లో పైడపల్లి వంశీ గురుంచి విన్నాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించి ఈ వీకెండ్ స్పాట్ పెట్టా.

సినిమా ఎలా అనిపించింది ?
స్టైలిష్ టేకింగ్. కథ నారేషన్ కూడా బాగానే వుంది. దిల్ రాజు ఈ సినిమా ఫ్లాఫ్ అని ఎప్పుడూ అనలేదు. మొన్న ఆడియో ఫంక్షన్ లో మాత్రమే స్పీడ్ బ్రేకర్ అన్నాడు. అలా అనకుండా వుండాల్సింది అనిపించింది. అన్ని సినిమాలకు డబ్బులు వెనక్కి వస్తేనే హిట్ అనడం భావ్యం కాదు. ఆ కేటగిరిలో నాకు నచ్చిన సినిమా అని వుంటే బాగుండేది. సందర్భాన్ని మాటలు మారిస్తే నాకు చిరాకు. మున్నా సినిమా ఫ్లాఫ్ అయినా, మళ్ళి నేనే అవకాశం ఇచ్చాను అని గొప్పలు చెప్పుకోవడానికి అన్నట్టుగా మాట్లాడటం బాదాకరం. Director is Worth Talented.

ప్రభాస్ ఎలా చేసాడు ?
కొత్త లుక్ తో వున్నాడు. హెయిర్ స్టైల్ కూడా కొత్తదే. ఇమేజ్ వున్న హీరోల కొత్త లుక్ ను తెలుగు ప్రేక్షకులు accept చెయ్యాలంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా కథ బాగా స్ట్రాంగ్ గా వుండాలి. కథ స్ట్రాంగ్ కాదు. సినిమా రిలీజ్ అనుకున్న టైంకు కాకుండా జాప్యం అయినట్టు గుర్తు. ఆ జాప్యం జరగకుండా, కొన్ని జాగ్రత్తలు తీసుకొని వుంటే హిట్ అనిపించుకునేది ఏమో అనిపించింది. ప్రభాస్ బాగా చేసాడు.

జూనియర్ దర్శకుడిని మరో అవకాశం ఇవ్వడం కరెక్టేనా ?
హిరో గెటప్ విషయంలో మళ్ళి అదే తప్పు దర్శకుడు చేస్తున్నాడు అనిపించింది. I could be wrong. క్లాస్ ప్రేక్షకుల ఆదరణ కోసం మరీ అంత క్లాస్ లుక్ ఏమి అవసరం లేదు. జూనియర్ మీసాలు లేకుండా నటించడం పెద్ద ఎక్సపరమెంట్. మాస్ పంచ్ మిస్ అవ్వడమే కాదు. క్లాస్ లుక్ తో మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ మరింత కంపు అయ్యే అవకాశం వుంది.

ఫైనల్ గా చెప్పేది ఏమిటి ?
కథ: క్లిష్టమైనది. ఏమి చెప్పాలనుకున్నాడో నాకు అర్ధం కాలేదు. ట్విస్ట్లు బాగున్నాయి.
కథనం :బాగుంది. కాని యాక్షన్ సీక్వెన్సస్ శృతి మించడం వలన సహజత్వం పోయి, కథ మర్చిపోయేలా చేసాయి.
డైలాగ్స్: అద్భుతంగా సెట్ అయ్యాయి. పండాయి కూడా.
డైరక్టర్ worth experimenting. కుర్రోడి మీద Supervising వుంటే మంచి అవుట్ పుట్ ఇవ్వగలడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా. Bookmark the permalink.