క్షమించగలగడం

నాకు శత్రువులు తక్కువే. దానికి కారణం నేను పెద్దగా మాట్లాడక పోవడం, దానికి మించి అసలు వాదించకపోవడం.

వయసుతో చాదస్తం కూడా పెరగడం వలన ఈ మధ్య వాదించడం, ఎక్కువ మాట్లాడటం చేస్తున్నాను. దీనిని కంట్రోల్ చెయ్యాలనుకుంటున్నాను, కాని చేయలేక పోతున్నాను.

శత్రువు అంటే ఎక్కువగా వూహించుకోకండి. జస్ట్ మాట్లాడకపోవడం.

ఇద్దరికీ వాదనలలో గొడవ అయితే, తమదే కరెక్ట్ అనుకుంటారు. తప్పు ఒప్పుకున్నా, ఆ తప్పును అలా అడ్రెస్ చేయకుండా వుండల్సింది అని ఇరు వర్గాలు అంటుంటాయి. మూడో వ్యక్తి చెప్పే మాటలు ఇద్దరికీ ఎక్కవు.

క్షమించగలగడం అనే మనసత్వం కలిగివుండటం చాలా క్లిష్టమైనది. ఈ మనసత్వం కలిగి వున్నోళ్ళంత అదృష్టవంతులు మరోకరు వుండరు. ఈ మనసత్వం కలిగి వుండే, తప్పు నీదే అని ఎవరైనా అంటే “అవును నాదే .. అది వదిలేయారా” అని అనగల్గుతారు. ఇటువంటి వారికి అహం , అహంకారం లేనట్లే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.