జావా సముద్రం

జావా సముద్రంలోకి దూకి ఈదాలని ఎప్పటినుండో ఉబలాటం. ఇప్పటికి వందసార్లు జావా సముద్రంలోకి దిగివుంటాను కాని, అది సముద్రపు ఒడ్డులో మాత్రమే. మొన్న వారమే మళ్లీ దిగాను. ఇది నూట ఒకటవ సారి. ఈసారి ఎలాగైనా నడిసముద్రం లోకి వెళ్ళాలని దృడ సంకల్పంతో వున్నాను.

ఈ సారి ఎంత దూరం వెళ్ళతానో చూడాలి.

ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ ఈరోజే తగిలింది. స్పీడ్ బ్రేకర్ అంటే అన్నీ ఒకేసారి తెలుసుకోవలనుకోవడం , చివరికి ఏదీ తెలుసుకోకుండా పోవడం.

ఈసారి కలిసోచ్చే అంశం ఏమిటంటే, నా చూట్టూ నా కంటే ఎక్కువ స్థితిలో(నాలెడ్జ్ పరంగా) వున్నవాళ్ళే. వారి మాటలు నేను జావా నేర్చుకోవడానికి కావలసిన ఉత్సా హాన్ని ఇస్తాయి అని ఆశీస్తున్నాను.

జావా నేర్చుకోవడంలో నా నిరుత్సాహానికి ముఖ్య కారణం నాకు జావా నేర్చుకోవలసిన అవసరం లేకపోవడం. ((కేవలం ఇష్టం మాత్రమే))

ఈసారి ఎలాగైనా ఫినిష్ చేయాలని సాయిబాబాను ప్రార్దిస్తూ పయనం సాగిస్తున్నాను. నాకు కూడా జావా వచ్చు(జావా తెలుసు కాదు) అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం కష్టపడుతున్నాను. Target Reaching DATE: January 1st, 2011

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.