a2z

గత రెండు రోజులు వర్క్ తో బిజీ. నిద్ర కూడా లేదు. ఈ రోజు కూడా నిద్ర పట్టడం లేదు. ఏమి హెడ్డింగ్ పెట్టాలో తెలియక అని a2z పెట్టాను. ఈ రోజు ఫ్రెండ్ తో డిస్కస్ చేసిన విషయాలు;

సలహాలు: మనం పాటించలేని సలహాలు మరొకరి ఇవ్వకూడదు. మనం పాటించకుండా మరొకరి నీతులు చెప్పకూడదు. మౌనం వహించాలని అనుకున్నాను. కాని దానిని బ్రేక్ చేస్తూ ఈరోజు ఎందుకో ఫ్రెండ్ గాడికి ఒక సలహా ఇచ్చాను. డ్రైవింగ్ చేస్తున్నపుడు మన దృష్టి ఎప్పుడూ డ్రైవింగ్ మీదే ఎలా వుంటుందో మన లక్ష్యం వైపు మన ప్రయాణం అలానే వుండాలి అని. మన పక్కన వున్న వాళ్ళతో మాట్లాడుతూనే మనం డ్రైవ్ చేస్తుంటాం, అలానే వేరే పనులు చెయ్యాలి. లక్ష్యంపై దృష్టి/ఆలోచన మాత్రం పోకూడదు.

అభిప్రాయాలు: నాకు నచ్చని అభిప్రాయాలపై నా స్టైల్లో నా అభిప్రాయం ఇది అని చెప్పడం మానుకోవాలి.. ఇగ్నోర్ చెయ్యడం బెటర్.

సినిమా కథ;
1)లైను: లైను అనుకోవడం సో ఈజీ. ఒక్కో సినిమా చూస్తున్నప్పుడు , ఆ సినిమా నుంచి ఒక కొత్త లైను పుట్టించవచ్చు.

2)స్క్రిప్ట్: toughest part. సంవత్సారాలు సంవత్సారాలు కష్టపడితే కాని ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయలేము. రాంగోపాలవర్మ చెప్పినట్టు ఒక లైను అనుకుంటే, ఒక క్రియేటర్ బుర్ర దాని మీదే పని చేస్తూ వుంటుంది. రాజమౌలి చెప్పినట్టు లైను కాపి కొట్టినా, చాలా సినిమాలకు స్క్రిప్ట్ మాత్రం కొత్తదే వుంటుంది. కాబట్టి తెలుగు సినిమాలను ఇంగ్లీష్ సినిమాల నుంచి కాపి అనలేము. స్పూర్తి మాత్రమే.

3)స్క్రీన్ ప్లే: దీనికి జనాల పల్స్ తెలియాలి. అందరినీ ఆకట్టుకోవడానికి స్క్రీన్ ప్లే లో చిన్న చిన్న ఐడియాలు, మొత్తం కథ ఫీల్ నే మార్చేస్తాయి.

నేను స్క్రిప్ట్ మీద పని చేయలేను. దీనికి fully dedicated టైం కావాలి. బోల్డంతా రిసెర్చ్ చెయ్యాలి.

as of now, కొన్నాళ్ళ పాటు సినిమా కలలకు ఫుల్ స్టాఫ్ పెట్టి, నా అవసరానికి కావలసిన జాబ్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకరికి సలహాలు ఇవ్వడం కాదు. మనం పాటించ గలగాలి. నౌ మై ఫోకస్ ఈజ్ టు కీప్ మై జాబ్ safe and secure, which I have never done before.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.