ఖలేజ – My Expectations

మగధీర రికార్డ్స్ ను బద్దలు కొట్టే సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

మగధీర రికార్డ్స్ ను బద్దలు కొట్టడానికి ఛాన్స్ వున్న కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఖలేజ.

ఇప్పటి దాకా పబ్లిక్ లోకి వచ్చిన పాటలు, ట్రైలర్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచే విధంగానే వున్నాయి. నిన్న చూసిన ట్రైలర్ అయితే కేక. మహేష్ బాబు ఎంతో ఎనర్జీతో సూపర్ స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.

తెలంగాణ ఇష్యూతో సినిమాపై జనాలు అంత ఇంటరెస్ట్ చూపుతున్నట్లుగా అనిపించడం లేదు. రోబో సినిమా జనాల మూడ్ ను కొంత మరలించింది అనే చెప్పవచ్చు.

మగధీర రికార్డ్స్ ను బద్దలు కొట్టి, టాలీవుడ్ హిరో, దర్శకులలో మంచి కసి రేపాలని, ప్రాంత విద్వేషాలతో మానసికంగా డిస్టర్బ్ అయిన తెలుగు మనసులకు “మనుషులంతా ఒకటే” అనే భావాన్ని ఈ సినిమా స్పూర్తిని ఇవ్వాలని, మన స్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఖలేజ ప్రీ రిలీజ్ క్రేజ్ ను కొట్టగల కాంబీనేషన్ అంటే ‘త్రివిక్రమ్-చరణ్’. ఆ కాంబీనేషన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసే విధంగా ఈ సినిమా వుంటుందని ఆశీస్తున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.