ఖలేజా vs మగధీర

ఎంత కలక్ట్ చేసింది .. ఎన్ని రోజులు ఆడింది .. అదంతా డిఫరెంట్ !

మగధీర సినిమా కోసం హిరో కష్టపడవలసింది ఏమీ లేదు. కావలసిందల్లా జస్ట్ ఇమేజ్ మరియు లుక్. కష్టం అంతా దర్శకుడిదే.

ఖలేజా అలా కాదు. దర్శకుడు ఎంత కష్టపడాలో, హిరో దానికి పదింతలు కష్టపడాలి.

ఓవర్ యాక్షన్ అంటే పవన్ కళ్యాణ్ గుర్తు వస్తాడు. పవన్ కళ్యాణ్ బాటలో అల్లు అర్జున్, మనోజ్ కూడా వెళ్ళుతున్నారు. అది అంత ఈజీ విషయం కాదు. ఓవర్ యాక్షన్ ఒకోసారి మరీ ఓవర్ అయిపోయి బెడిసి కొడుతుంది. అటువంటి సమయాల్లో విమర్శకులు నుంచి వచ్చే కామెంట్స్ అయితే టూ మచ్.

ఎంత మందికి నచ్చింది అనే మాట పక్కన పెడితే, ఖలేజా లో మహేష్ బాబు లా చేయడం అనేది ఏ హిరోకైనా ఒక డ్రీమ్ లాంటింది. for me it is totally surprise from mahesh babu & చాలా బాగా నచ్చింది. బాగా చేయడంలో మహేష్ బాబు నచ్చాడు. మహేష్ బాబుకు కావలిసింది క్రియేట్ చేసిన త్రివిక్రమ్ నచ్చాడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.