ఆరెంజ్ రిలీజ్ టైంమింగ్

సినిమాకు రిలీజ్ టైంమింగ్ ఎంతో ముఖ్యమైనది, సబ్జక్ట్ ను బట్టి రిలీజ్ టైం వుండాలన్నది నా నమ్మకం. చిరంజీవి ‘అన్నయ్య’ సినిమాను సంక్రాంతి టైం లో రిలీజ్ చేయడానికి రెండు/మూడు నెలలు వెయిట్ చేయడం నాకు బాగా గుర్తు వుంది. నవంబరులో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. మరి చరణ్ ‘ఆరెంజ్’ సినిమా నవంబరులో ఎందుకు ప్లాన్ చేసారో తెలియడం లేదు. సంక్రాంతికి వేరే మెగా సినిమా కూడా ఏమీ లేదు.

బహుశా చందాలకోసం సినిమాలపై పడి లొల్లి చేసున్న కొందరు తెలంగాన గుండాలకు భయపడే అనుకుంట. ఈ గుండాలు నిజమైన తెలంగాణ వాదుల , తెలంగాణ వీరుల నిజాయితీని మంట కలుపుతున్నారు.

ఇప్పుడు తెలుగు వాళ్ళు అందరూ కలిసే వుంటున్నాం. గత యాభై ఏళ్ళుగా కలిసే వున్నాం. ఇకముందు కూడా కలిసే వుందాం అనేవాళ్ళ మాటలకు విలువ/గౌరవం ఇవ్వనంత కాలం ఏర్పాటు వాదులకు గౌరవం ఇవ్వరు అనే సంగతి వాళ్ళు తెలుసుకుంటే మంచిది.

ప్రత్యేక తెలంగాణ సమస్య అందరిది. ఎవరైనా తమ అభిప్రాయాన్ని నిర్యభ్యతరంగా చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ సమస్య , రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడాలి, సినిమా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకూడదు అనడం ఎంత వరకు సమంజసం ?

దేవుడి దయ వలన ఇప్పుడు ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. మడమ తిప్పి నాటకాలు ఆడితే ప్రజలే బుద్ది చెపుతారు. ప్రజలను రెచ్చగొట్టి, అమాయకుల ప్రాణాలు అర్పిస్తూ రాజకీయ పబ్బం గడుపు కోవలనుకుంటున్న నాయకులకు నూకలు చెల్లినట్టే.

ఏదో రకంగా కె.సి.ఆర్ కేంద్రం చేత ‘ఊ’ కొట్టించాడు. అందరూ ఏకమై ఒకే మాటపై నిలబడ వలసిన సమయంలో, నాయకులు తమలో తాము కొట్టుకోవడానికి సమాయత్తమవ్వడం చూస్తుంటే, తెలంగాణపై ఆశలు పెట్టుకున్న ప్రజలను మోసం చేయడానికే అని అర్దం అవుతుంది.

ఛస్ .. ఏదో వ్రాద్దాం అనుకుంటే .. ఎటో పోయింది నా పోస్ట్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.