బృందావనం – My Talk

బృందావనం సినిమా ప్రత్యేకత ఏమిటి ?
ప్రీక్షకులను ఆకట్టుకోవడానికి అందరూ sincereగా ప్రయత్నం చేయడం మొదటిది కాగా, ఈ సినిమా చూస్తున్నంత సేపూ మనకు గుర్తు రాని తెలుగు సినిమా లేకపోవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.. ప్రతిక్షణం డైలాగ్స్ రైటర్ కొరటాల శివ కేక పుట్టించడం అసలైన ప్రత్యేకత.

అందరూ అంటే ?
1) దర్శకుడు .. 2) హిరో .. వాళ్ళను సపోర్ట్ చేసిన నిర్మాత మరియు టెక్నికల్ టీమ్.

అంటే నీ ఉద్దేశం మిగతా సినిమాలు sincereగా ప్రయత్నం చెయ్యరు అనా ?
NO. I mean ఈ సినిమా ప్రీక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రయత్నం జరిగింది.

క్లాస్ సినిమానా ? మాస్ సినిమానా ?
ఇది పక్కా మాస్ సినిమా. విశ్వనాథ్ గారి సినిమా అన్నట్టు ఎందుకు పబ్లిసిటీ ఇచ్చారో అర్ధం కావడం లేదు. ఈ సినిమా పబ్లిసిటీ, ప్రేక్షకులు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే అనుమానం/భయంతో చేసినట్టుగా అనిపిస్తుంది.

వారు sincereగా చేసిన ప్రయత్నం నీకు నచ్చిందా ?
కొత్తదనం ఏమి లేకపోవడం, సాంగ్స్ ఆశీంచిన స్థాయిలో లేకపోవడం నిరుత్సాహపరిచింది. మాస్ కు కావలసినంత ఎంటరటైన్ మెంట్ వుంది. సెంటిమెంట్ కూడా బాగా పండింది.హిట్ అనిపించుకునే సినిమానే అనిపించింది.. ఆద్యంతం వినోదంతో సాగిన సినిమా అయినా, ఈ సీన్స్ అన్ని ఇంతకుముందు చూసినవే కదా అనే ఫీలింగ్ వచ్చింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.