ఖలేజా కంటే బృందావనం సినిమాకు బెటర్ టాక్, బెటర్ కలక్షన్స్ మరియు బెటర్ రివ్యూస్ వచ్చాయి. కాని బృందావనం లో వున్న ఒకే ఒక లోపం కథాపరంగా అసలు కొత్తదనం లేకపోవడం.
ఖలేజా సినిమా టాక్ రాక ముందే చూసాను. నాకు ఎక్సలెంట్ గా నచ్చింది. టాక్ మాత్రం నా టాక్‌కు పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. కాలమే సమాధానం చెపుతుంది అన్న రీతిలో, నాతొ పాటు చాలా మందికి ఈ సినిమా నచ్చిందని చదువుతుంటే ఎంతో ఆనందం వేసింది.
నాకు తెలిసి ఖలేజా సినిమాలో పెద్ద లోపం, కథ ఎక్కడ జరుగుతుందనేది స్పష్టంగా కన్విన్సింగ్ గా లేదు మరియు విలేజ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అనేది స్పష్టంగా చెప్పలేదు.
ఖలేజా లో మహేష్ బాబు క్యారెక్టర్ క్రియేట్ చేసి, దానికి కావలసిన వినోదాన్ని ఇచ్చిందే త్రివిక్రమ్. మహేష్ బాబు బాగా చేసాడు కాని, త్రివిక్రమ్ చెడగోట్టాడు అనే కామెంట్స్ వింటుంటే చాలా కామెడీగా వుంది.
బృందావనం విషయానికి వస్తే కొత్తదనం లేదు అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రతి ఫేము కథకుడిగా దర్శకుడు ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. లాజికల్ పాయింట్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు. కొన్ని మైండ్ లెస్ యాక్షన్ సీక్వేన్సస్ తప్ప అంతా ఫరఫెక్ట్ గా execute చేసాడు.
my Final point: రెండు సినిమాలలో వినోదానికి లోటు లేదు. but మై చాయిస్ ఖలేజా, మెజారిటీ పబ్లిక్ చాయిస్ బృందావనం. ఖలేజా సినిమా ద్వారా upset అయిన మహేష్ బాబు ఫాలోయర్స్ దూకుడు సినిమాతో సంతృప్తి చెందుతారనుకుంటున్నాను.