రక్తచరిత్ర – నాకు ఎలా అర్ధం అయ్యింది ?

సినిమా చూడవచ్చా ?
1) సినిమా అంతా హింసే. 2) ఒక యాదర్థ కథకు కల్పితాలు ఉహించి సినిమాగా మలిచాను. అని రాంగోపాలవర్మ చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పాడు. దానికి తోడు ఇది ఒక డబ్బింగ్ సినిమా అనుకోని ప్రిపేర్ అయ్యి వెళ్ళవచ్చు.

పరిటాల రవిని హీరోగా చూపించాడా ?
YES. హిరోగానే చూపించాడు. రెండో భాగంలో మరో హీరోకు ఎలా టార్గెట్ అవుతాడనే ఇంటరెస్టింగ్ పాయింట్ మీద ఆపేసి ప్రేక్షకులను ఉత్కంటలో పడేసాడు.

ఎన్.టి.ఆర్ ను హింసను ప్రోత్సహించే వ్యక్తిగా చూపెట్టిన మాట వాస్తవమేనా ?
ఈ ప్రశ్నను “ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో విలనా ?” అని అనుకున్నాను. ఎన్.టి.ఆర్ ను చాలా మంది దేవుడితో సమానంగా ఆరాధిస్తారు. ఎన్.టి.ఆర్ దేవుడు కాదు. ఆయన కూడా మనిషే అని చాలా స్పష్టంగా చెప్పాడు. దీనినే తెలుగుదేశం వాళ్ళు విలన్ అన్నట్టు ప్రచారం చేసారు. సినిమాలో చూపెట్టింది నిజమా ? అని పక్కన పడితే, నా దృష్టిలో తప్పుగా(విలన్ గా)ఏమీ చూపించలేదు. ఒక బలవంతుడు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే, పగతో అతనిని ఎదిరించాలనుకునే మరో మంచి బలవంతుడిని ప్రోత్సహించడంలో అసలు తప్పు లేదు. ఒక చిరంజీవి అభిమానిగా ఈ క్వాలిటీనే చిరంజివీలో లేదని నేను బాదపడేది.

ఈ కథను సినిమాగా తీయడంలో రాంగోపాలవర్మ ఉద్దేశం ఏమిటి ?
ఎందుకు తీసాడో నాకైతే అర్ధం కాలేదు. రెండు బలమైన వర్గాలకు రాంగోపాలవర్మ విలన్ గా కనిపిస్తాడు. పాజిటివ్ సైడు తీసుకుంటే రెండు బలమైన వర్గాలు ఏకమై రాంగోపాలవర్మను విమర్శించడం బాగుంది.

రెండో భాగంలో పవన్ కళ్యాణ్ గుండు సీన్ వుంటే నీకు అభ్యంతరం లేదా ?
అసలు అభ్యంతరం లేదు. నాది పవన్ కళ్యాణ్ బాటే. మౌనమే నా సమాధానం.(you must click here) .. ఒక అబద్దం నిజంగా ప్రచారంలో వుంది. ఈ సినిమా ద్వారా పరిటాల రవి వర్గం వారు, అది అబద్దం అని చెప్పగల్గితే బాగుంటుందని ఆశీస్తాను. నా ఆశ ఫలించదు అని తెలుసు. మానవుడు ఆశాజీవి కదా.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.