నిన్ననే ఆరెంజ్ ఆడియో ఫంక్షన్ పూర్తిగా చూసాను. ఆరెంజ్ సినిమా గురుంచి కాకుండా, బ్లడ్ బ్యాంక్ .. పైరసీ .. సో ఆన్ .. కంపు .. కంపు .. ఆడియో ఫంక్షన్ లేకుండానే పాటలు రిలీజ్ చేసి వుంటే బాగుండేది అనిపించేలా, సినిమా హైపుకు ఎందుకు పనికిరాని ఆడియో ఫంక్షన్ లా జరిగింది అని చెప్పవచ్చు.
ఈ సినిమా క్రియేటర్ ‘బొమ్మరిల్లు బాస్కర్’ ఈ సినిమా గురుంచి చెప్పిన మాటలు బాగున్నాయి. అతని మాటల ప్రకారం ఆరెంజ్ – మేలిమి బంగారం. ఒక నిజానికే శక్తి వుంటే మనిషి రాతలనే తిరగబెడుతుంది అంటున్నాడు.
ఈ సినిమా పాటలను బట్టి, ఒక జులాయిగా తిరిగే ఒక లవర్ బాయ్ ప్రేమికుడిగా మారితే ఎంతలా ప్రేమిస్తాడు అన్నదే ఈ సినిమా కథ అని నాకు అనిపిస్తుంది. లవర్ బాయ్ నుంచి ప్రేమికుడిగా మారిన ఈ సినిమాలో హిరోకు వున్న క్వాలిటీ ‘నిజాయితీ మరియు నిజాలను దాయక పోవడం’. పాటలు పాటల కోసం అని కాకుండా, సినిమాలో ఒక భాగం కావడం ఈ సినిమా ప్రత్యేకత అంటున్నారు. ఈ సినిమాలో హిరో వేసే ప్రతి అడుగు కరెక్ట్ అనిపించేలా వుండటం మరో ప్రత్యేకత.