ఆరెంజ్ పబ్లిసిటీ

ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేస్తున్న విషయం సినిమాల పబ్లిసిటీ.

పబ్లిసిటీ అంటే ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం. (వ్యాపార బాషలో మోసం అని కూడా అంటారు)

రక్తచరిత్ర : ఈ సినిమా పబ్లిసిటీ చాలా నిజాయితీ జరిగింది అని చెప్పవచ్చు. ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ , ట్రైలర్స్ మరియు ఇంటరవ్యూలు అన్నీ ఒకే మాట “ఈ సినిమాలో హింస తప్ప ఏమీ వుండదు” అని చెప్పాయి. ఇంత ధైర్యంగా ఈ విధంగా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం వలెనే సినిమాకు పాజిటివ్ టాక్ తీసుకొని వచ్చాయి అని నా ఫీలింగ్.

మర్యాద రామన్న: ప్రెస్ మీట్ పెట్టి, ఈ సినిమా స్టోరి ఇది అని చెప్పేయడం ఈ సినిమా పబ్లిసిటీ ప్రత్యేకత.

వరుడు: సరప్రైజ్ ఇద్దామనుకున్నారెమో ఒక యాక్షన్ మూవీని ఒక పూర్తీ ఫ్యామిలీ మూవీగా పబ్లిసిటీ ఇచ్చారు.ప్రేక్షకులు సరప్రైజ్ అనుకోలేదు, మోసం అనుకున్నారు.

కొమరం పులి: అలరెడి సినిమాపై చాలా హైప్ వుండటం వలన మోసం చేసే ప్రయత్నం చేయలేదు. ట్రైలర్స్ ఎంత చెత్తగా వున్నాయో సినిమా కూడా అలానే వుంది. హై ఎక్సపేటెషన్స్ వలన ఎక్కువ దెబ్బతింది.

ఖలేజా: ఇటువంటి సినిమాకు , సినిమా రిలీజ్ తర్వాత బారీ పబ్లిసిటీ అవసరం. మహేష్ బాబు ‘అర్జున్’ సినిమాకు ఎటువంటి పబ్లిసిటీ ఇచ్చారో అటువంటి పబ్లిసిటీ అవసరం. రిలీజ్ టైంమింగ్ బ్యాడ్ అవ్వడం వలన(post పబ్లిసిటీ చాన్స్ లేకుండా) ఈ సినిమా బాగా దెబ్బతింది అని నా ఫీలింగ్.

బృందావనం: వరుడు సినిమాలానే మోసం చేసారు. ఒక మాస్ సినిమాను, క్లాస్ సినిమాగా చెప్పుకొచ్చారు. సినిమాలో మాస్ కు కావలసిన అంశాలు పుష్కలంగా వుండటంతో గట్టేక్కెంది.

ఆరెంజ్: సినిమా పబ్లిసిటీకి ఎంతో ఉపయోగ పడే ఆడియో ఫంక్షన్ ను నాశనం చేసారు. సినిమాపై హైప్ రాలేదు. పాటలు ఒక వర్గ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. నాలంటోళ్ళకు ఎవరేజ్(బెటర్ దెన్ బృందావనం). మాస్ కు సినిమా వచ్చాక, సినిమా బాగుంటే నచ్చే సాంగ్స్. పాటలు ఒక కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా చెప్పగల్గాయి. పోస్టర్స్, ట్రైలర్స్ కూడా ఒక క్లాస్ టచ్ వున్న సినిమా గానే ప్రొజెక్ట్ చేస్తున్నాయి.

ఈ సినిమా పబ్లిసిటీ ద్వారా నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే ” మనసును హత్తుకునే ఒక మంచి క్లాస్ సబ్జక్ట్”. మాస్ ను ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది అనే దానిపైనే ఈ సినిమా కమర్షియల్ విజయం ఆదారపడి వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.