థాంక్స్ టు కూడలి, హారం విజిటర్స్ !

కూడలి

haaram logo

రాంగోపాలవర్మ: నాకు ఎమోషన్స్ వుండవు. నేను ఎమోషన్స్ ను స్టడీ చేస్తుంటాను.

నేను: బ్లాగు హిట్స్ ను నేను కేర్ చెయ్యను.

పై స్టేట్ మెంట్స్ అబద్దం: సెకండ్ or థర్డ్ పర్సన్స్ కోణంలోంచి చూస్తే పై రెండు స్టేట్ మెంట్స్ అబద్దాలు. ఎమోషన్స్ లేని వ్యక్తీ అంటూ వుంటాడని నేననుకోను.

పై స్టేట్ మెంట్స్ నిజం: ఏ పని చెయ్యాలన్న మనిషికి ఉత్సాహం కావాలి. డైలీ మనం చేసే పనులకు అవసరమే ఉత్సాహాన్ని కలిపిస్తుంది. బ్లాగు వ్రాయవలసిన అవసరం మనకు లేదు. బ్లాగు వ్రాయడానికి కావలసిన ఉత్సాహాన్ని బ్లాగు హిట్స్ కలిపిస్తాయి. బ్లాగు హిట్స్ ను నేను కేర్ చెయ్యను అనేది నిజం, ఎందుకంటే ‘నా కోసం నేను బ్లాగు వ్రాసుకుంటున్నాను కాబట్టి’. అని నేననుకుంటాను.

‘నా బ్లాగు నా ఇష్టం’ – కాదనలేని సత్యం. మన బ్లాగుకు అగ్రిగేటర్స్ నుంచి హిట్స్ కావలనుకున్నపుడు, ‘నా బ్లాగు నా ఇష్టం’ అనే స్టేట్ మెంట్ లో మార్పులు చెయ్యాలి. అగ్రిగేటర్స్ ని మన బ్లాగు యాడ్ చేయమని రిక్వెష్ట్ చేశామంటే , బ్లాగు వ్రాయడానికి ఉత్సాహాన్ని బయట నుంచి ఆశీస్తున్నట్టే. వారిని గౌరవించవలసిన బాద్యత వుంది.

ఆఫీస్ లో చేతినిండా పని లేకపోవడం వలన బ్లాగింగ్ ఒక వ్యసనంలా తయారయ్యింది. నేను-చిరంజీవి గోల భరించలేక పోతున్న అగ్రిగేటర్స్ నుంచి వస్తున్న విజిటర్స్ బాధను అర్ధం చేసుకొని అగ్రిగేటర్స్ నుంచి ఒక సంవత్సరం పాటు తప్పుకున్నాను. ఆ సంవత్సర కాలంలో నా ఉత్సాహం ఏమీ తగ్గలేదు సరికదా, సెల్ఫ్ డబ్బా ఎక్కువై పోయింది. back to అగ్రిగేటర్స్ కు రావడం వలన సెల్ఫ్ డబ్బా కంట్రోల్ చేసుకోవలసి వస్తుంది.

అగ్రిగేటర్స్ లో చేరకూడదు అనే డిసిషన్ ను సడలించడానికి కారణం శరత్ గారు. ఈ బ్లాగుకు మాములుగా రోజుకు వంద నుంచి రెండు వందల పేజి హిట్స్ వుండేవి. 20 మంది రెగ్యులర్ విజిటర్స్ వున్నారు. నా బ్లాగును శరత్ గారు ఆయన బ్లాగులో యాడ్ చేసిన దగ్గర నుండి ఇంకో ఐదు మంది పెరిగారు. why not అగ్రిగేటర్స్ అని అనిపించింది. అనిపించడమే తరువాయి, ఒట్టు గట్టు మీద పెట్టి కూడలి-హారం వారిని రిక్వెష్ట్ చేయడం, వారు యాడ్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు విజిటర్స్ నాలుగింతలు పెరిగారు.

My request: అగ్రిగేటర్స్ లో నా బ్లాగు చేర్చడానికి ప్రదాన కారణం, నాకు ఒక సినిమా వెబ్ సైటు ఓపెన్ చెయ్యాలి అనే కల(ఆలోచన) ఎప్పటినుండో వుంది. ఆ కలను నిజం చేసుకునే దిశలో ఈ బ్లాగును డైవర్ట్ చేయదలచుకున్నాను.. నేను వ్రాసే తప్పుఒప్పులను మన్నించి ఎక్కువ అలోచించకుండా ప్రోసిడ్ అయిపోండి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.