రివర్స్ గేర్ లో పవన్ కళ్యాణ్ సినిమా

Allu Sirish: Though technically a remake of Love Aaj Kal, the script evolved so much during scripting – its like a brand new film all2gather.

పవన కళ్యాణ్ తమ్ముడు సినిమాను అందరూ ఫ్రీమేక్(copy with out paying money to original creator) అనుకునేవారు. కాని అది రీమేక్(paid money to original creator). ఒరిజనల్ మూవీ jo jeeta wohi sikandar లో అమీర్ ఖాన్ హిరో. ఒరిజనల్ మూవీకి , మన తెలుగు తమ్ముడు మూవీకి చాలా చాలా మార్పులు చేసారు. ఒక కొత్త మూవీ చూసిన అనుభూతే కలుగుతుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న Love Aaj Kal రీమేక్ సినిమా కూడా అదే తరహాలో వుంటుందన్నట్టుగా మెగా పబ్లిసిస్ట్ అల్లు శిరీష్ పై విధంగా ట్విట్ చేసాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ మార్పులు చేయడం ఈ రీమేక్ ప్రత్యేకత.

నా దృష్టిలో పాత కాలపు ప్రేమను చూపించడానికి, ప్రేక్షకులకు పాత కాలంలోకి తీసుకొని వెళ్ళడానికి మంచి స్కోప్ వున్న చిత్రం. నేను హింది వర్షన్ లో కన్విన్స్ కానిది ఏమిటంటే రిషి కపూర్ యంగ్ లో సైఫ్ ఆలీ ఖాన్ గా కనిపించడం. నాకు తెలిసి ఆ ఒక్క పాయింట్ ను కన్విన్సింగ్ గా చెప్పగల్గితే సినిమా సూపర్ హిట్ గ్యారంటీ.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవో కారణాలు చేత డిలే అవుతూ వుంటాయి. మొదట్లో క్వాలిటి కోసం అని చెప్పుకొచ్చేవారు. హిట్ అయితే డిలే పెయిన్ అనిపించదు. జానీ, బంగారం, కొమరం పులిలా అయితే అంచనాలు పెట్టుకున్న వాళ్లకు దూల తీరి జీవితం మీదే విరక్తి వచ్చుద్ది.

నాకు తెలిసి పవన్ కళ్యాణ్ సినిమాలలో అనుకున్న టైంకు అనుకున్నట్టుగా తీసిన సినిమా ‘అన్నవరం’. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా నిర్మింపబడుతుంది. రివర్స్ గేర్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే, స్లోగా నడిచే పవన్ కళ్యాణ్ సినిమాలకు భిన్నంగా ఫాస్ట్ గా నిర్మింపబడుతున్న సినిమా అని నాలోని కవి భావం.. 🙂

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.