ఆరెంజ్ – రామ్ చరణ్ తొలి అడుగు

పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు ముందు చేసిన మూడు సినిమాలు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’ ఒక రకమైన ఒత్తిడిలో చేసినవే. తొలిప్రేమ సినిమా కరుణాకరన్ సృష్టి అయినా, పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి నమ్మకంతో చేసాడు. మొదటి మూడు సినిమాలు పెద్ద హిట్లు కాకపోవడంతో తొలిప్రేమపై అసలు ఒత్తిడి లేదు. కొత్త దర్శకుడితో ఏదో కష్టపడుతున్నాడు అని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. రిలీజ్ అయ్యాక, తొలిప్రేమ సినిమా ఎందరికో ఫేవరేట్ సినిమా కావడమే కాదు, పవన్ కళ్యాణ్ నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి.

ఇప్పుడు ఆరెంజ్ సినిమా కూడా తొలిప్రేమను గుర్తుకు తెస్తుంది. రామ్ చరణ్ మొదటి రెండు చిత్రాల ఎంపికలో అతని ప్రమేయం చాలా చాలా తక్కువ. ఆరెంజ్ అలా కాదు. బొమ్మరిల్లు భాస్కర్ మంచి పేరున్న దర్శకుడు అయినా, మాస్ ను మెప్పించలేని దర్శకుడు అనే భయం వుంటుంది. చరణ్ దగ్గరుండి భాస్కర్ తో తనకు కావలసిన విధంగా కథ-కథనాలను తయారు చేయించుకొని నాగబాబును ఒప్పించి సినిమా చేస్తున్నాడు. నాగబాబుతో పాటు చిరంజీవి, అల్లు అరవింద్ లు వినే వుంటారు. ఇక్కడ ఆరెంజ్ కు తొలిప్రేమతో వున్న కామన్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమా చెయ్యాలని ఫస్ట్ డెసిషన్ తీసుకుంది చరణ్ like పవన్ కళ్యాణ్ ఫర్ తొలిప్రేమ.

ఒక విధంగా ఆరెంజ్ సినిమా చరణ్ తొలి సినిమా కాకపోయినా డెసిషన్ మేకింగ్ లో తొలి అడుగు అనవచ్చు. మగధీర లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రావడం, ఈ సినిమాకు పెద్ద లోపం అయినా చరణ్ కు ఫెరఫర్మాన్స్ పరంగా మంచి స్కోప్ వుండి కొత్త అభిమానులను చేరుస్తూ, కమర్షియల్ గా మగధీర సినిమాలో సగం కలెక్ట్ చేసినా చాలు.

ORANGE Lyrics:
01. ఉల.. ఉలాల.. అలా చూస్తుంటేనే చాలా

02. చిలిపిగా చూస్తావ్ అలా..

03. నేను నువ్వంటూ

04. హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ

05. ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ

06. రూబ రూబ .. హే రూబ రూబ ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.