నేను .. నా రాక్షసి

చిరుత , మగధీర సినిమాలలో నా ఓటు చిరుతకే. ఎందుకంటే చిరుత సినిమాకు ముందు రామ్ చరణ్ ఏమిటి అనేది ప్రేక్షకులకు తెలియదు. presenting him in చిరుత is so much tougher than మగధీర. అలాగే పోకిరి , మగధీర సినిమాలలో నా ఓటు పోకిరికే. ఎందుకంటే 8 కోట్లతో ప్రోడక్ట్ తయారు చేసి, 40 కోట్లు పైగా రాబట్టగల్గారు. అటువంటి దర్శకుడికి ఇప్పుడు టైం అనుకూలంగా లేదు అంతే.

పోకిరి సినిమాకు ముందు పూరి జగన్నాథ్ పని అయిపోయిందన్నారు. పోకిరి సినిమాతో తెలుగుసినిమా కెపాసిటి ఇది అని మహేష్ బాబు చేత చెప్పించాడు. పోకిరి తర్వాత అల్లు అర్జున్ కు ‘దేశ ముదురు’, చరణ్ కు ‘చిరుత’ ప్రభాస్ కు ‘బుజ్జిగాడు’ ఇచ్చి, వారికి ఒక కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసాడు.

పోకిరి సినిమాకు ముందు పూరి జగన్నాథ్ పరిస్థితి ఎలా వుందో ఇప్పుడు అలానే వుందనవచ్చు. ఏమి చూపించినా రొటీన్ అంటున్నారు. లీడర్ సినిమాలో బాగానే వున్నాడు అని మాత్రమే అనిపించుకున్న ‘రానా’ కు ఈ సినిమా ద్వారా మాస్ ఇమేజ్ తీసుకొని వస్తాడనిపిస్తుంది.

ఇడియట్, పోకిరి అనే వర్డ్స్ ను ప్రేమికుల మద్య పాజిటివ్ రొమాంటిక్ వర్డ్స్ గా మార్చిన ఘనత పూరిదే. అదే విధంగా ‘ఇట్లు శ్రావణి .. సుబ్రమణ్యం ‘ అనే టైటిల్ కూడా ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఆకట్టుకుంది. ‘నేను .. నా రాక్షసి’ టైటిల్ కు వున్న ప్రత్యేకత ఏమిటంటే ‘ఇట్లు శ్రావణి .. సుబ్రమణ్యం ‘ లా ఆకట్టుకుంటూ రాక్షసి అనే వర్డ్ ను పాజిటివ్ రొమాంటిక్ వర్డ్ గా మార్చే పనిలో ఉన్నాడనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.