తెలుగు సినిమాలపై హైప్

హైప్ అంటే నా నిర్వచనం: మన ఎక్సపేటెషన్స్ కు మించి మనకు తెలియనిది సినిమాలో ఏదో వుంటుందని అనిపించడం.

ఏ సినిమా హిరో అయినా, దర్శకుడు అయినా, నిర్మాత అయినా తమ సినిమాలై మాక్జిమమ్ హైప్ క్రియేట్ అవ్వాలనే కోరుకుంటారు. హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. ఒక సినిమాపై హైప్ ఉన్నంత మాత్రాన వీర లెవెల్లో కలక్షన్స్ వుంటాయనుకొను. హైప్ తో పాటు ఎక్సపేటెషన్స్ వుండాలి, ఎక్సపేటెషన్స్ తో నమ్మకం వుండాలి. హైప్ క్రియేట్ చెయ్యాలంటే ప్రోపర్ పబ్లిసిటీ అవసరం.

ఈ మధ్య కాలంలో బాగా హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మగధీర. చరణ్ మొదటి సినిమా చిరుతలో ఏమి లేదు అన్నారు. రాజమౌళి సినిమాలో ఏదో ఒక్క ఎపిసోడ్ తప్ప మిగతా సినిమా అంతా భరించలేము అన్నారు. గీతా ఆర్ట్స్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టారు అన్నారు. పాటలు not upto expectations అన్నారు. కాని ఈ సినిమాకు కనివిని ఎరుగని రీతిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఎలా క్రియేట్ అయ్యిందంటే ‘నమ్మకం’. రాజమౌళి, గీతా ఆర్ట్స్ & చరణ్ లపై వున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఎక్సలెంట్ పబ్లిసిటి. ఆ టైంలో అన్నీ కలిసొచ్చినాయి.

ఆరెంజ్ కు అదే లెవెల్ లో ఎందుకు క్రియేట్ అవ్వలేదు అని అలోచిస్తున్నా. ఒక సినిమాపై హైప్ క్రియేట్ అవ్వాలంటే , ఆ సినిమాకు పనిచేసే టీం మరియు సినిమాకు చేసే పబ్లిసిటీ . ఈ కండిషన్ కు పవన్ కళ్యాణ్ & మహేష్ బాబు సినిమాలు exception. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎంత లో-ప్రొఫైల్ maintain చేసినా రిలీజ్ టైంకు అనుకోని రీతిలో హైప్ క్రియేట్ అయిపోతుంది. STARDOM అంటే అదేనేమో లేక వాళ్ళు సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం & అయిన దానికి కాని దానికి బయటకు రాకపోవడం వలనేమో..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.