మూడో సినిమాలో ముగ్గురు హీరోయిన్లు: మూడు సాహసాలు

తొలి సినిమా ‘చిరుత’. మలి సినిమా ‘మగధీర’. రాబోతున్న మూడవ సినిమా ‘ఆరెంజ్’. మూడూ మూడు రకాల కాన్సెప్ట్స్. దేనితో దేన్నీ పోల్చడానికి లేదు. దటీజ్ రామ్ చరణ్. కథలను, పాత్రలను ఎంచుకోవడంలోనే నటుల ప్రజ్ఞ బయట పడేది. ‘మగధీర’ లాంటి సంచలనం తర్వాత ‘ఆరెంజ్’ లాంటి ఫీల్‌గుడ్ మూవీ చేయాలన్న ఆలోచనే చరణ్‌లోని అభిరుచికి నిదర్శనం. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నవంబర్‌ 19న రిలీజ్‌ అవుతుంది.

పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని సమాచారం. ప్రేమకోసం ఎంతటి సాహసానికైనా తెగించే డైనమిక్ ప్రేమికుడుగా ఇందులో చరణ్ కనిపిస్తాడు. ప్రత్యేకత ఏమిటంటే, ముగ్గురు హీరోయిన్లు వున్నా డ్యూయిట్స్ ఉండవు.

ముగ్గురు హీరోయిన్లు:

  1. జెనీలియా లీడ్ రోల్ చేస్తోంది.
  2. సెకెండ్ హీరోయిన్ గా షాజన్‌ పదమ్ ‌సీ నటిస్తోంది. సెకెండాఫ్‌ ప్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాల్లో షాజన్‌ పదమ్‌ సీ కనిపించనుంది.
  3. సంచితా శెట్టి…అనే బెంగుళూరుకి చెందిన మోడల్ మరో కీలకమైన పాత్రను చేస్తోంది.

మూడు సాహసాలు:

  1. 14,000 అడుగుల ఎత్తులో హెలికాప్టర్‌ నుంచి స్కైడైవ్‌,
  2. స్కూబా డైవింగ్‌ ఫైట్‌,
  3. ఓ రిస్కి ట్రైన్‌ ఫైట్‌.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, వేరే సైటు నుంచి కాపీ, సినిమా, Xclusive. Bookmark the permalink.