కత్తికి పదునేంత ?

కళ్యాణ్‌రామ్‌ కు అతనొక్కడే లాంటి మాస్ హిట్ వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో చాలా చాలా వెనుకబడ్డాడు.

ఎన్టీఆర్‌ నటించిన ‘అదుర్స్’ ఈ ఏడాదే విడుదలై విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించిన ‘సింహా’ అంతకుమించిన విజయం నమోదు చేసింది. మళ్లీ ఇదే ఏడాది ఎన్టీఆర్‌ నటించిన ‘బృందావనం’ కూడా విజయం సాధిస్తోంది. ‘అమరావతి’ చిత్రానికిగాను ‘ఉత్తమ ప్రతినాయకుడు’గా నందమూరి తారకరత్న ప్రతిష్టాత్మక నంది అవార్డునందుకున్నారు. కనుక నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘కత్తి’ చిత్రం కూడా కత్తిలాంటి విజయం సాధించడం ఖాయం’ అని అంటున్నారు.

ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్‌ తాను టార్గెట్ చేసే మాస్ ఇమేజ్ వస్తుందని ఆశీద్దాం.మా ఫ్రెండ్ నేను సజెస్ట్ చేసిన కథలన్నీ పక్కన పెట్టి, కళ్యాణ్‌రామ్‌ కు కత్తి లాంటి మరో మాస్ సబ్జక్ట్ తయారు చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాలని , కొత్త దర్శకులను ఇదే విధంగా ఎంకరేజ్ చేస్తూ మా వాడికి కూడా ఒక బ్రేక్ ఇవ్వాలని ఆశీస్తూ All the BEST to Kalyan RAM !

కళ్యాణ్‌రామ్ సరసన సనాఖాన్ నటించిన ఈ కత్తి చిత్ర్రాన్ని కొత్త దర్శకుడు మల్లికార్జున్ దర్శకత్వంలో కళ్యాణ్‌రామే నిర్మించారు.. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో శరణ్యామోహన్, ‘కిక్’శ్యామ్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, డా.బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అజయ్, రఘుబాబు, సమీర్, రాఘవ, సత్యకృష్ణ, ఝాన్సీ, తెలంగాణ శకుంతల, విజయరంగరాజా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: ఎం.రత్నం, కెమెరా: సర్వేష్ మురారి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.