బాలకృష్ణ ‘సింహా’ దర్శకుడితో చిరంజీవి 150వ చిత్రం

ఆరెంజ్ ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ ‘సింహా’ దర్శకుడు బోయపాటిని చూసినప్పటి నుండి సింహా సినిమా నచ్చని మెగా అభిమానులలో ఒకటే టెన్షన్. ఇదే అదనుగా మా హిరోతో హిట్ కొట్టగానే చిరంజీవి మా దర్శకుడి వెనుక వెంట పడుతున్నాడంటూ నందమూరి అభిమానులు చిరంజీవిపై సెటైర్లు.

బోయపాటి ఆరెంజ్ ఆడియో ఫంక్షన్ కు ఎందుకు అటెండ్ అయ్యాడో తెలియదు కాని, దాని ఆధారంగా చిరంజీవి 150వ చిత్రానికి అతనే దర్శకుడు అంటూ ఉహాగానాలు, న్యూస్లు మొదలయ్యాయి. యంగ్ ఎన్.టి.ఆర్ తో అతని సబ్జక్ట్ ఫైనల్ కాకపోవడం, ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి ఈ సంవత్సరంలో అందరికీ(exhibitor, distributors and producer) లాభాలు తెచ్చిన సినిమా సింహా ఒక్కటే అని పొగడటం ఆ ఉహాగానాలకు న్యూస్లకు మరింత ఆధారమయ్యాయి.

ఇంకో పక్క తన 150వ చిత్రానికి చిరంజీవే స్వీయా దర్శకత్వం చేసుకుంటున్నాడంటూ మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సినిమా ప్రేక్షకులలో చిరంజీవి చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారని పెద్ద ఉత్కంఠ లేకపోయినా ఈ ప్రచారాలతో ఉత్కంఠ క్రియేట్ చేయడానికి మీడియా ప్రయత్నం చేస్తుందనిపిస్తుంది.

మరో పక్క రాంగోపాలవర్మ తనకు మెగాస్టార్ ను డైరక్ట్ చెయ్యాలని వుందని, దొర – The Lord అని టైటిల్ కూడా ఎనౌన్స్ చేసేసాడు.

ఇక నా జీవితం ప్రజలకే అంకితం, రెండు పడవలపై ప్రయాణం చేయలేను అంటూ మొన్నటి దాకా చెప్పుకొచ్చిన చిరంజీవి, మాట మార్చి, నెలలో 20 రోజులు రాజకీయాలు 10 రోజులు అంటూ ఎనౌన్స్ చేసిన సంగతి అందరికీ విదితమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.