వ్రాసేవాళ్ళు ఎక్కువ .. చదివేవాళ్ళు తక్కువ !

తెలుగు బ్లాగులు వ్రాసేవాళ్ళు ఎక్కువ .. కాని చదివేవాళ్ళు చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎప్పుడు చూడండి ఏవో అప్‌డేట్స్ కనిపిస్తూనే వుంటాయి. కాని వాటిని చదివేవారి సంఖ్య 300 మించడం లేదు.

ఏ కమర్షియల్ వెబ్‌సైటు తీసుకున్నా రోజుకు నాలుగైదు అప్‌డేట్స్ మించి వుండవు. అవి కూడా ఇక్కడో ఎక్కడో చదివినవే. వాటికి మాత్రం వేల వేల హిట్స్ వస్తాయి.

జల్లెడ, కూడలి, హారం, మాలిక లాంటి అగ్రిగేటర్స్ లొ మన బ్లాగు చేర్చనంత కాలం బ్లాగు మన వ్యక్తిగతం. ఒక్కసారి చేర్చాక ఉత్సాహాన్ని బయట నుంచి అడుక్కున్నట్టే. వాటిల్లో చేర్చినంత మాత్రాన వ్యక్తిగతం కాకుండా పొదు. పదిమంది చదువుతారనే దృష్టితోనే వ్రాస్తాం.

మొన్నక్కడో ఒక కామెంట్ చదివా. కూడలంతా సినిమాకు సంబంధించిన పోస్ట్స్ తో నిండి పోయింది, పోస్ట్స్ వ్రాయలనిపించడం లేదు అని. ఆయన చెప్పిన దాంట్లో నిజం లేకపొలేదు. సినిమాకు సంబంధించిన పోస్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే కారణంగా ఆయన వ్రాయడం లేదు అని ఆయన అనేది పిచ్చ కామెడీగా వుంది.

రెండు మార్పులు జరగాలి అనుకుంటున్నాను.
1) చదివేవాళ్ళు పెరగాలి. దీని కోసం ఏమి చెయ్యాలో నాకు తెలియదు కాని, బ్లాగు లోకానికి కమర్షియల్ లుక్ తీసుకొని రావాలి.
2) అందరి పోస్ట్స్ కూడలి మెయిన్ పేజిలో ఎక్కువ సేపు కనిపించే టట్టు వుండాలి. దానికొసం అగ్రిగేటర్స్ ఒక వ్యూహాన్ని ఆలోచించాలి.

నాకు కూడా నవతరంగం, చిత్రమాలిక లా ఒక మూవీ వెబ్‌సైటు నిర్వహించాలని చాలా చాలా ఉబలాటంగా వుంది. ఆ సైటును ఎవరి చేతో కాకుండా, నేనే డెవలప్ చెయ్యాలనుకొవడం వలన నిర్వధిక వాయిదా పడుతూ వస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.