ఆరెంజ్ ఖలేజాలా నాకు నచ్చాలి

నేను రామ్‌చరణ్ అభిమానిని కాదు. కాని మెగా హిరో కాబట్టి, మెగా అభిమానిగా అతని సినిమాలు బాగానే ఫాలో అవుతాను, అందరికీ మంచి లాభాలు తేవాలని కోరుకుంటాను.

స్టిల్స్, ట్రైలర్స్ చూసి ఆరెంజ్ సినిమా మొదటి రోజే చూసేయాలి అని నిర్ణయించేసుకున్నాను.

నేను మాస్ ప్రేక్షకుడిని. నాకు మాస్ సినిమా బృందావనం మరీ అంతలా నచ్చక పోవడానికి కారణం, నేను బృందావనం మాస్ సినిమా అని ప్రిపేర్ అయ్యి చూడలేదు.

నాకు ఖలేజా సినిమా విపరీతంగా నచ్చింది. మహేష్ బాబు నటన అంతకంటే బాగా నచ్చింది.

ఆరెంజ్ సినిమా నుంచి నేను కోరుకునేది ఏమిటంటే, ఖలేజా సినిమాలా నాకు నచ్చాలి. దానితో పాటు బృందావనం సినిమాలా కమర్షియల్ హిట్ అవ్వాలి.

వరస్ట్ కేస్, కమర్షియల్ ఫ్లాఫ్ అయినా పర్వాలేదు, ‘వరుడు’ ‘కొమరం పులి’ మాదిరి కాకుండా ఖలేజా సినిమాలా నాకు నచ్చాలి. మహేష్‌బాబు స్టైల్లో కాకపోయినా, మహేష్‌బాబు తరహాలో చరణ్ కూడా ఆరెంజ్ సినిమాలో నటనా పరంగా వీర ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత బాగా చేసాడు అనే దాని కన్నా, ఎంత మందికి నచ్చింది అనే దాని మీదే ఈ సినిమా రేంజ్ ఆదారపడి వుంది. I MEAN అతని నటన నాకు, నాతో పాటు కొంతమందికి నచ్చితే ఆనందం లైక్ ఖలేజా. అందరికీ నచ్చి కమర్షియల్ హిట్ కూడా అయితే ఇంకా ఆనందం.

Note: పై కేక డిజైన్ క్రియేట్ చేసింది ధరణీరాయ్ చౌదరి గారు .

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.