కె.సి.ఆర్ కూడా ముంచేస్తాడా ?

ప్రత్యేక తెలంగాణను తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు అనేది ఎంత నిజమో ప్రత్యేక తెలంగాణకు తెలంగాణ నాయకులే అడ్డు అనేది అంతే నిజం.. ఈ రోజు కె.సి.ఆర్ ఇంటర్వ్యూ చదివితే అదే అనిపించింది. కె.సి.ఆర్ మరియు కాంగ్రెస్ ఆడుతున్న పెద్ద నాటకమా అనే డౌట్ వచ్చే విధంగా వుంది. తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసేయడం అంత ఈజీ కాదు. చేస్తే నాలుగు ముక్కలు చెయ్యాలి. దానికి తోడు హైదరాబాద్ వాసులు పూర్తి ఆభద్రతతో తెలంగాణతో కలిసి వుండటానికి అసలు ఇష్టపడటం లేదు.

తెరమరుగవుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కె.సి.ఆర్ తన సొంత రాజకీయ లబ్ది కోసమే భుజాలపై ఎత్తుకున్నాడు అని సమైక్య వాదులు చేసున్న విమర్శలు నిజం కానున్నాయ ? కె.సి.ఆర్ కూడా తెలంగాణ ప్రజల ఆశలను ముంచేస్తాడా ? — కాలమే సమాధానం చెప్పాలి.

తెలంగాణ నాయకులంతా ఒక మాటపై నిలబడి తెలంగాణను సాధించు కోవలసిన సమయంలో, చాలా స్పష్టంగా తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెపుతున్న చంద్రబాబును విలన్ గా చూపించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.పార్లమెంట్ లో బిల్లు పెట్టవలసిందిగా కేంద్రంపై ఒత్తిడి పెట్టవలసిన సమయంలో ఇదిగో తెలంగాణ , అదిగో తెలంగాణ అంటూ ప్రజలను మభ్య పెడుతూ, చంద్రబాబుని విమర్శించడంతోనే కాలం గడుపుతూ, డిసెంబర్ కాదు ఫిభ్రవరి దాకా పొడిగిస్తున్నాను అని అనడం ఏమిటి ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.