ఆరెంజ్ పై హైప్ బాగానే వుంది

ఒక సినిమాపై హైప్ క్రియేట్ అవ్వాలంటే అంత ఈజీ విషయం కాదు. హైప్ అంటే ఒక కోణంలో సినిమాపై అతి నమ్మకం అని కూడా అనవచ్చు.. అతి నమ్మకం అంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపించడం.

భాస్కర్ అనగానే నాకు ముందు నుంచి జీరో Expectations. సాంగ్స్ వచ్చాక ఏమైనా పెరుగుతాయి అనుకుంటే, సాంగ్స్ అంత కస్ అనిపించలేదు. దానికి తోడు ఆడియో ఫంక్షన్ లో ఒక్కరు కూడా సినిమా గురుంచి నమ్మకంగా మాట్లాడలేదు. సాంగ్స్ వినగా వినగా నచ్చుతాయి అనుకుంటే ఒక మాస్ సాంగ్ మిస్ అయ్యిందనే ఫీలింగ్ పోవడం లేదు.

నిన్న మా అన్నయ్యతో మాట్లాడుతుంటే క్లాస్ లేదు మాస్ లేదు ఎక్కడ చూసినా ఇవే సాంగ్స్ అని చెప్పాడు. అంతలా ఎక్కయా అని ఒకింత ఆశ్చర్యపోయా. నో డౌట్ వైరటీ సాంగ్స్ నచ్చే వాళ్లకు కచ్చితంగా నచ్చుతాయి అనుకున్నాను, కాని మాస్ కూడా నచ్చాయి అంటుంటే నమ్మబుద్ది కావడం లేదు. దీనిని బట్టి ప్రస్తుతం ఆరెంజ్ పై హైప్ బాగానే వుందనిపించింది.

ఈ సినిమా ఎవరు ఎన్నెన్ని సార్లు చెప్పుకుంటుంటే వినే సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంటున్న హారిస్ జైరాజ్ మాటలు వింటుంటే నాకు కూడా ఈ సినిమా ఎప్పుడు చూస్తామనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.